Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

టేస్టీ జీడిపప్పు పాయసం, జీడిపప్పు ఆరోగ్య ప్రయోజనాలేమిటి?

సోమవారం, 20 నవంబరు 2017 (14:10 IST)

Widgets Magazine

జీడిపప్పులో ప్రో-ఆంతోసైయనైడ్‌లు జీడిపప్పులో వుండటం వల్ల ఇది ట్యూమర్లను అడ్డుకుంటుంది. ముఖ్యంగా క్యాన్సర్ పెరుగుదల నియంత్రణలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. జీడిపప్పులో తక్కువ శాతం కొవ్వు వుండటం వల్ల గుండె ఆరోగ్యానికి ప్రయోజనకారిగా చెపుతారు వైద్యులు. ఇందులో వున్న యాంటీ-ఆక్సిడెంట్ల కారణంగా గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవు. 
Cashew nut Payasam
 
జీడిపప్పులో మెగ్నీషియం అధికంగా వుండటం వల్ల రక్తపోటు సమస్యను నిరోధిస్తుంది. కేశాలు పట్టులా ఒత్తుగా వుండేందుకు జీడిపప్పు ఉపయోగపడుతుంది. ఇందులో వుండే కాపర్ కారణంగా నల్లటి జుట్టు సొంతమవుతుంది. బాల నెరుపు వున్నవారు జీడిపప్పును తింటుంటే మంచిఫలితం వుంటుంది. బరువును కంట్రోల్ లో వుంచడంలోనూ జీడిపప్పు కీలక పాత్ర పోషిస్తుంది. అందువల్ల అవకాశం మేరకు జీడిపప్పును మనం తయారుచేసే పదార్థాల్లో భాగంగా చేసుకుంటే మంచిది. ఇప్పుడు జీడిపప్పు పాయసం ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం. 
Cashew nut Payasam
 
కావలసిన పదార్థాలు : 
జీడిపప్పు... 10 గ్రాములు
పిస్తా పప్పు... 10 గ్రాములు
పచ్చకర్పూరం... చిటికెడు
కుంకుమపువ్వు... చిటికెడు
నెయ్యి... 4 టీస్పూన్లు
బాదం పప్పు... 95 గ్రాములు
చక్కెర... 200 గ్రాములు
పాలు... 1/2లేదా3/4 లీటరు
ఏలక్కాయ... 7 లేక 8
 
తయారీ విధానం :
ముందుగా జీడిపప్పును చిన్నచిన్న ముక్కలుగా చేసుకోవాలి. జీడిపప్పు ముక్కలు, పిస్తా పప్పును కలిపి నేతిలో వేయించుకోవాలి. బాదంపప్పును వేడి నీటిలో నానపెట్టాలి. ఓ గంట తరువాత బాదంపప్పు మీద తొక్కతీసి, మెత్తగా రుబ్బుకోవాలి. నూరిన బాదంపప్పు ముద్దకి 3/4 లీటరు నీళ్ళు కలిపి, మరగపెట్టాలి.
 
అంటే పచ్చివాసన పోయేంత వరకు మరగనిచ్చి, అందులో చక్కెర, వేయించి ఉంచిన జీడి, పిస్తా పప్పులు, పచ్చకర్పూరం, కుంకుమపువ్వులను వేసి కలపాలి. అంతే బాదంపప్పు పాయసం రెడీ... ఈ పాయసాన్ని ఆరిన తర్వాత ఫ్రిజ్‌లో ఉంచి అనంతరం సర్వ్ చేయొచ్చు. కూలింగ్ వద్దనుకునే వారికి వేడివేడిగా సర్వ్ చేయొచ్చు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

బెల్లం వేరుశెనగ కలిపి తింటే ఎంత ప్రయోజనమో తెలిస్తేనా...?

స్థూలకాయం అనేది పెద్ద సమస్యగా మారింది. చిన్నచిన్న పిల్లలు కూడా విపరీతమైన బరువు ...

news

వర్షాకాలంలో వేడి వేడి పకోడీలు, బజ్జీలు లాగించేస్తున్నారా?

వర్షాకాలం, శీతాకాలంలో వేడి వేడి పకోడీలు, బజ్జీలు వంటి నూనెలో వేయించిన ఆహార పదార్థాల ...

news

ఇలా చేస్తే రెండు రోజుల్లో లివర్ శుభ్రమవుతుంది..

మన శరీరంలో ప్రతి అవయవం ముఖ్యమైనదే. ఆ అవయవాలు సరిగ్గా పనిచేయాలంటే మనం తినే తిండిపైనే అది ...

news

డయాబెటిస్ రోగులు అరటిపండు తినొచ్చా? (video)

అరటిపండులో కార్బొహైడ్రేట్లు పుష్కలంగా వుంటాయి. ఇవి కొవ్వును ఉత్పత్తి చేస్తాయి. మ‌ధుమేహం ...

Widgets Magazine