శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 24 మార్చి 2017 (15:50 IST)

అధిక బరువు సమస్యకు అనపకాయ వేపుడు

మన తోటలో లభించే సొరకాయలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. సొరకాయ అధిక బరువును తగ్గిస్తుంది. శరీరంలోని చెడు నీటిని టాక్సిన్ల ద్వారా సొరకాయ బయటికి నెట్టేస్తుంది. అలాగే నరాల బలహీనతను దూరం చేస్తుంది. శీతల వ

మన తోటలో లభించే సొరకాయలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. సొరకాయ అధిక బరువును తగ్గిస్తుంది. శరీరంలోని చెడు నీటిని టాక్సిన్ల ద్వారా సొరకాయ బయటికి నెట్టేస్తుంది. అలాగే నరాల బలహీనతను దూరం చేస్తుంది. శీతల వ్యాధులకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఉదర రుగ్మతలను నయం చేస్తుంది. సొరకాయ పిందెలతో అధిక బరువు తగ్గవచ్చు. సొరకాయ పిందెలతో వేపుడు చేసుకుని ఆహారంలో రోజూ చేర్చుకుంటే.. ఒబిసిటీ దూరమవుతుంది. 
 
సొరకాయ పిందెలతో వేపుడు ఎలా చేయాలంటే..? బాణలిలో నూనె పోసి వేడయ్యాక అందులో నువ్వుల నూనె పోయాలి. వేడయ్యాక ఆవాలు చేర్చాలి. ఆపై ఉడికించిన సొరకాయ ముక్కల్ని అందులో చేర్చాలి. బాగా వేగాక తగినంత ఉప్పు చేర్చాలి. ఆపై పొడిచేసుకున్న వేరుశెనగ, మిరపకాయ, వెల్లుల్లి మిశ్రమాన్ని అందులో చేర్చాలి. ఈ వేపుడును ఆహారంలో చేర్చుకుంటే రుచికి రుచి.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తుంది.
 
సొరకాయను రోజువారీ ఆహాంలో చేర్చుకోవడం ద్వారా చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది. శరీరానికి చలవ చేస్తుంది. అయితే సొరకాయను అధికంగా  తీసుకోకూడదు. పరిమితంగా తీసుకోవాలని  ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.