హృద్రోగులు క్రమంతప్పకుండా చేయాల్సిన పనులు...

ఇటీవలికాలంలో అనేక మంది హృద్రోగాలబారిన పడుతున్నారు. ఇలాంటివారు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ముఖ్యంగా, హృద్రోగ బాధితులు తరచూ చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను విధిగా టెస్ట్ చేసుకోవాలి.

cholesterol
pnr| Last Updated: బుధవారం, 22 నవంబరు 2017 (13:08 IST)
ఇటీవలికాలంలో అనేక మంది హృద్రోగాలబారిన పడుతున్నారు. ఇలాంటివారు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ముఖ్యంగా, హృద్రోగ బాధితులు తరచూ చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను విధిగా టెస్ట్ చేసుకోవాలి. గుండె ధమనుల్లో కొవ్వు పేరుకుపోకుండా ఉండేందుకు ఎల్‌డీఎల్‌ (చెడు కొలెస్ట్రాల్‌)పై ఓ కన్నేసి ఉంచాలని వైద్యులు చెపుతున్నారు.

గుండె పోటు, స్ట్రోక్‌ బారినపడిన రోగుల్లో కొవ్వు స్థాయిలను పరీక్షించుకోని వారిలో తదుపరి స్ట్రోక్‌ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని పరిశోధకులు చెపుతున్నారు. గుండె జబ్బులతో బాధపడుతున్న 66 ఏళ్ల సగటు వయసున్న 60,000 మందిపై ఈ అధ్యయనం నిర్వహించగా, కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచే మందులు తీసుకుంటున్న వారితో పోలిస్తే ఎల్‌డీఎల్‌ను అసలు పరీక్షించుకోని వారిలో గుండె సంబంధిత మరణాలు ఎక్కువగా నమోదైనట్టు తేలింది.


దీనిపై మరింత చదవండి :