బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Kowsalya
Last Updated : సోమవారం, 4 జూన్ 2018 (18:16 IST)

ఎముకల దృఢత్వానికి ఖర్జూరాన్ని తీసుకుంటే?

శరీరానికి తక్షణ శక్తినిచ్చే పండ్లలో ఖర్జూరం ముందు వరుసలో ఉంటుంది. ఇందులో అనేక రకాలైన పోషకవిలువలున్నాయి. ఇందులో విటమిన్ ఎ, బి లతో పాటు క్యాల్షియం, ఐరన్, పాస్పరస్, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. పాలతో కలిపి త

శరీరానికి తక్షణ శక్తినిచ్చే పండ్లలో ఖర్జూరం ముందు వరుసలో ఉంటుంది. ఇందులో అనేక రకాలైన పోషకవిలువలున్నాయి. ఇందులో విటమిన్ ఎ, బి లతో పాటు క్యాల్షియం, ఐరన్, పాస్పరస్, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. పాలతో కలిపి తీసుకుంటే ఖర్జూరం చక్కటి ఫలితాలను ఇస్తుంది. దీనిని రోజు తీసుకోవడం వలన అనేక ప్రయోజనాలు పొందవచ్చును.
 
రక్తపోటును అదుపులో ఉంచి, గుండె సంబంధించిన వ్యాధులను దూరంగా ఉంచుతుంది. అత్యంత తియ్యగా ఉండే ఖర్జూరంలో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ అధికంగా ఉన్నాయి. ఇవి తీసుకున్న వెంటనే రక్తంలో కలిసిపోయి తక్షణమే శక్తిని అందిస్తాయి. ఇందులో యాంటీ ఆక్సిడెట్స్ రూపంలో ఉండే విటమిన్ సి కంటికి చాలా మంచిది.
 
దీనిని రోజు తీసుకోవడం ద్వారా కంటి సమస్యలు కూడా తగ్గుతాయి. ఆరోగ్యకరమైన బరువు పెంచడంలో ఖర్జూరం ఎంతో సహాయపడుతుంది. బాగా సన్నగా ఉన్నవారు రోజు ఖర్జూరాన్ని తినడం వల్ల సహజంగా బరువు పెరుగుతారు. ఇది తక్కువ కొలెస్ట్రాల్, ప్రోటీన్స్ అధికంగా కలిగి ఉంటుంది. మూత్రపిండాల్లో ఏర్పడే రాళ్ళను కరిగించే శక్తి ఖర్జూరానికి ఉంది.
 
మలబద్దక సమస్యలను దూరంచేస్తుంది. రాత్రిపూట నీటిలో నాలుగైదు ఖర్జూరాలను నానబెట్టుకుని ఉదయాన్నే బాగా వాటిని బాగా పిండి ఆ నీటిని తీసుకోవడం ద్వారా మలబద్దకాన్ని తగ్గించుకోవచ్చు. ఖర్జూరం విరోచనకారిగా కూడా పనిచేస్తుంది. ఇందులో కాపర్ సమృద్ధిగా ఉండడం వలన ఎముకలను ధృడంగా ఉంచుతాయి. ఇందులో ఉండే ఔషధ గుణాలు పెద్ద ప్రేగులోని సమస్యలను నివారించుటకు ఉపయోగపడుతాయి.