శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 24 జులై 2018 (14:40 IST)

మధుమేహం వున్నవారు.. చేపలు, చికెన్‌తో సరిపెట్టుకుంటే?

మధుమేహుల్లో నీరసాన్ని పోగొట్టే శక్తి జీడిపప్పు, బాదంలకు వుంది. కాబట్టి వాటిని రోజుకు నాలుగేసి తీసుకోవాలి. వీటితా పాటు పిస్తా, వాల్‌నట్స్ తీసుకోవచ్చు. ఉడకబెట్టిన కాయగూరలు, నూనెల్లో ఆలివ్ నూనె, సోయాబీన్

మధుమేహం వున్నవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలో.. ఎలాంటి ఆహారం తీసుకోకూడదో ఓసారి చూద్దాం. 
 
మధుమేహుల్లో నీరసాన్ని పోగొట్టే శక్తి జీడిపప్పు, బాదంలకు వుంది. కాబట్టి వాటిని రోజుకు నాలుగేసి తీసుకోవాలి. వీటితా పాటు పిస్తా, వాల్‌నట్స్ తీసుకోవచ్చు. ఉడకబెట్టిన కాయగూరలు, నూనెల్లో ఆలివ్ నూనె, సోయాబీన్‌లను అధికంగా తీసుకుని.. ఇతర నూనెలను మితంగా వాడొచ్చు. ఇక మాంసాహారంలో చేపలు, చికెన్ తీసుకోవచ్చు. 
 
కానీ బీఫ్, మేక, పందిమాంసాలకు దూరంగా వుండాలి. ఇక మధుమేహులు జంక్ ఫుడ్, ఉప్పూ కారం, ఇతర మసాలాలు బాగా దట్టించిన ఫాస్ట్ ఫుడ్ తీసుకోకూడదు. అన్నం మితంగా తీసుకోవాలి. పిండి పదార్థాలు ఎక్కువగా వుండే దుంపకూరలు, బ్రెడ్ తీసుకోకూడదు. వెన్న, నెయ్యి పూర్తిగా మానేస్తే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.