శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 11 ఏప్రియల్ 2017 (10:36 IST)

వీర్యకణాల నాణ్యత పెరగాలంటే.. చేపలు, పీతలు, వెన్న తీసిన పాలు తీసుకోవాల్సిందే

వీర్యకణాల వృద్ధికి తీసుకునే ఆహారంలో పోషకాలు వుండాలి. వీర్య కణాలు ఆరోగ్యంగా, చురుగ్గా ఉండాలంటే పండ్లు, తాజా కూరగాయలు, తృణధాన్యాలు, చేపలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పురుషుల్లో వీర్య కణాల నా

వీర్యకణాల వృద్ధికి తీసుకునే ఆహారంలో పోషకాలు వుండాలి. వీర్య కణాలు ఆరోగ్యంగా, చురుగ్గా ఉండాలంటే పండ్లు, తాజా కూరగాయలు, తృణధాన్యాలు, చేపలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పురుషుల్లో వీర్య కణాల నాణ్యత స్వల్పంగా ఉండడం వల్ల 25 శాతం మంది సంతానహీనులవుతున్నారని తాజా అధ్యయనంలో తేలింది. 
 
అందుచేత పీతలు, చేపలు వంటి సముద్రపు ఆహారంతోపాటు కోళ్లు, కోడిగుడ్లు, కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, వెన్నతీసిన పాలు, కొవ్వు తక్కువగా ఉండే డెయిరీ ఉత్పత్తులు తీసుకోవడం వల్ల వీర్యకణాల నాణ్యత పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

అలాగే బంగాళాదుంపలు, సోయా ఉత్పత్తులు, జున్ను, మద్యం, వెన్న ఎక్కువగా ఉండే డెయిరీ ఉత్పత్తులు, కాఫీ, తీయగా ఉండే పానీయాలు, స్వీట్లు తినేవారిలో వీర్యకణ నాణ్యత తక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. సో వీర్య కణాల వృద్ధికి పోషకాహారం తీసుకోవాల్సిందే.