ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 16 అక్టోబరు 2017 (10:44 IST)

బరువు తగ్గాలంటే.. కోడిగుడ్డును ఉదయాన్నే తినండి..

బరువు తగ్గాలంటే కోడిగుడ్డును ఉదయాన్నే తినాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ప్రతిరోజూ అల్పాహారంగా కోడిగుడ్డును తీసుకోవడం ద్వారా అందులోని లో-క్యాలరీలు బరువును తగ్గిస్తాయి. అయితే రాత్రిపూట కోడిగుడ్డును తీ

బరువు తగ్గాలంటే కోడిగుడ్డును ఉదయాన్నే తినాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ప్రతిరోజూ అల్పాహారంగా కోడిగుడ్డును తీసుకోవడం ద్వారా అందులోని లో-క్యాలరీలు బరువును తగ్గిస్తాయి. అయితే రాత్రిపూట కోడిగుడ్డును తీసుకోవడం మానేయాలి. శరీర బరువును తగ్గించడంలో సాల్మన్ శక్తివంతంగా పనిచేస్తుంది. ఇందులో శరీర బరువును శక్తివంతంగా తగ్గించే ఒమేగా-3 అనే ఫాటీ ఆసిడ్లు పుష్కలంగా వున్నాయి. 
 
ఇక ముల్లంగిని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా బరువు తగ్గవచ్చు. వారానికి మూడుసార్లు ముల్లంగిని ఆహారంలో చేర్చుకుంటే.. అందులోని పొటాషియం, ఫోలిక్ ఆసిడ్, యాంటీ ఆక్సిడెంట్, సల్ఫర్ వంటి పోషకాలు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. తరచుగా ముల్లంగిని తీసుకోవటం వలన మీ జీర్ణక్రియ స్థాయిలను పెంచి, బరువు పెరుగుదలను అరికడుతుంది. 
 
అదేవిధంగా బ్రౌన్ రైస్‌ను తప్పకుండా డైట్‌లో చేర్చుకుంటే.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరడంతో పాటు బరువు తగ్గొచ్చు. తక్కువ క్యాలోరీలను కలిగి ఉండి, ఎక్కువ మొత్తంలో ఫైబర్‌లను కలిగివుండే బ్రౌన్ రైస్ తినడం వల్ల ఆకలి అనిపించదు. తద్వారా సులభంగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.