ఉల్లిపాయతో పంటి నొప్పి మాయం.. కివీస్, చీజ్, మష్రూమ్స్, స్వీట్ పొటాటో తీసుకుంటే?

బుధవారం, 28 జూన్ 2017 (11:46 IST)

ఉల్లిపాయ మన ఆరోగ్యానికి కావలసిన వ్యాధినిరోధక శక్తిని ఇవ్వడంతో పాటు క్రిములను వెలివేస్తుంది. ఉల్లితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. అలాంటి ఉల్లితోనే దంత సమస్యలను కూడా నివారించుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దంత సమస్యలకు ఉల్లి దివ్యౌషధంగా పనిచేస్తుందట. ఉల్లి ముక్కలను నొప్పిగా ఉన్న చిగుళ్ల వద్ద ఉంచితే పంటి నొప్పి నుంచి తక్షణం ఉపశమనం పొందవచ్చు. 
 
పంటి నొప్పి నుంచి తప్పించుకోవాలంటే.. ఉల్లి ముక్కల్ని అప్పుడప్పుడూ నములుతూ వుంటే సరిపోతుంది. లవంగం నూనె పంటి నొప్పిని తగ్గిస్తాయి. కాటన్‌ ద్వారా లవంగం నూనెను పంటి నొప్పి వున్న ప్రాంతంలో ఉంచితే మంచి ఫలితం ఉంటుంది.
 
ఉల్లి తరహాలోనే కీర ముక్కలను పంటి నొప్పి వున్న ప్రాంతాల్లో ఉంచితే ఉపశమనం లభిస్తుంది. పంటినొప్పి అధికంగా ఉంటే.. చిన్నపాటి అల్లం ముక్కను కట్ చేసి.. దాన్ని పంటికింద చిగుళ్లపై వుంచితే సరిపోతుంది. చిగుళ్లలో వాపుకు వేడి టీ బ్యాగ్‌ను కాసేపు చిగుళ్లపై ఉంచితే మేలు చేకూరుతుంది. రోజుకు రెండుసార్లు బ్రష్ చేయాలి. ఉదయం పూట వేడి నీరు లేదా వేడి నీటితో చిటికెడు ఉప్పు చేర్చి నోటిని పుక్కిలించాలి. ఇంకా దంత ఆరోగ్యం కోసం చీజ్, స్వీట్ పొటాటోస్, మష్రూమ్స్, కివీస్ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

సెల్ ఫోన్, కంప్యూటర్లలో గంటల పాటు పనిచేస్తున్నారా?: చేతివేళ్లు భద్రం గురూ...

కంప్యూటర్లలో గంటల పాటు పనిచేస్తున్నారా? అయితే మీ చేతివేళ్లు భద్రం అంటున్నారు ఆరోగ్య ...

news

పురుషులకు గుడ్ న్యూస్.. వారానికి రెండుసార్లు శృంగారంలో పాల్గొంటే గుండె పదిలం..

భాగస్వాములు ఉద్యోగాలు చేస్తుండటం.. హడావుడిగా పరుగులు తీయడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. ...

news

రొమాన్సును ఉన్నట్టుండి ఆపేస్తే.. గుండెకు ప్రమాదమా?

వివాహమైనప్పటి నుంచి రోజూ రొమాన్స్ చేసుకునే వ్యక్తి ఉన్నట్టుండి ఏదైనా అనివార్య కారణాల చేత ...

news

మలబద్దక సమస్యను అధిగమించడం ఎలా...?

మలబద్దక సమస్య అనేది ప్రతి ఒక్కరు ఏదో ఒక సమయంలో ఎదుర్కొంటుంటారు. ప్రతిరోజు మలవిసర్జన సరైన ...