శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 5 ఫిబ్రవరి 2018 (10:28 IST)

ద్రాక్షపండ్ల సమ్మేళనాలతో ఆ వ్యాధులు దూరం..

ద్రాక్షపండ్లను రోజూ ఓ కప్పు మోతాదులో తీసుకుంటే వృద్ధాప్య లక్షణాలను దూరం చేసుకోవచ్చు. ఇందులోని సి విటమిన్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వ్యాధి నిరోధకశక్తిని పెంచుతుంది. చర్మానికి మేలు చేస్తుంది. రాత

ద్రాక్షపండ్లను రోజూ ఓ కప్పు మోతాదులో తీసుకుంటే వృద్ధాప్య లక్షణాలను దూరం చేసుకోవచ్చు. ఇందులోని సి విటమిన్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వ్యాధి నిరోధకశక్తిని పెంచుతుంది. చర్మానికి మేలు చేస్తుంది. రాత్రి పూట హాయిగా నిద్రపోవాలంటే ద్రాక్ష పండ్లను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
 
తాజా అధ్యయనంలో ద్రాక్ష పండ్ల నుంచి తయారుచేసిన కొన్ని సహజ సమ్మేళనాలు కుంగుబాటు చికిత్సలో సహాయపడతాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ద్రాక్షల్లో వుండే డైహైడ్రోఫియాక్ యాసిడ్, మాల్విడిన్-3-ఓ గ్లూకోసైడ్ అనే సమ్మేళనాలు కుంగుబాటు.. ఒత్తిడి ద్వారా ఏర్పడే వ్యాధులను కూడా దరిచేరనివ్వవని తేలింది.
 
ప్రస్తుతం వైద్యులు సూచించే మందుల్లో 50శాతం కంటే తక్కువ మందికి తాత్కాలిక ఉపశమనం లభిస్తోందని.. అదే ద్రాక్ష సమ్మేళనాలతో మంచి ఫలితాలున్నాయని అమెరికాలోని ఇచన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు వెల్లడించారు. ఒత్తిడిని దూరం చేసి మెదడు పనితీరును ద్రాక్షలు మెరుగుపరుస్తాయని పరిశోధకులు తెలిపారు.