సోమవారం, 27 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సందీప్
Last Updated : బుధవారం, 24 ఏప్రియల్ 2019 (18:49 IST)

కోడిగుడ్డులోని తెల్లసొనను తేనెతో కలిపిన పాలతో తీసుకుంటే?

అతి తక్కువ ధరకే లభించి, మంచి పోషకాలను అందించే ఆహారం కోడిగుడ్డు. శాకాహారులు సైతం కోడిగుడ్డును ఇష్టంగా తింటారు. రోజూ ఒక కోడిగుడ్డును తింటే శరీరానికి ఎంతో ఆవశ్యకమైన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇది చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించి శరీరానికి మేలు చేసే హెచ్‌డిఎల్‌ కొలెస్ట్రాల్‌ని పెంచుతుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో కూడా ఇది దోహదపడుతుంది. 
 
గుడ్డు తెల్లసొనను, తేనె కలిపిన పాలతోపాటు తీసుకుంటే శరీరంలో ఉన్న విషపదార్థాలకు విరుగుడుగా పనిచేస్తుంది. గుడ్డులో కెరోటినాయిడ్లు, ల్యాటిన్‌, జెక్సాంతిన్‌ అనే పోషక పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. గుడ్డులో ప్రొటీన్ కూడా అధికంగా ఉంటుంది. దీనిలోని అమైనో ఆమ్లాలు తొమ్మిది రకాల శరీర అవయవాల పని తీరును మెరుగుపరుస్తాయి. 
 
రోజూ కోడిగుడ్డు తినడం వలన శరీరానికి అవసరమైన విటమిన్లు‌, మినరల్స్‌, కార్బొహైడ్రేట్లు, ఖనిజాలు అందుతాయి. గుడ్డులో ఫోలెట్‌ ఐదు శాతం, సెలీనియం 22 శాతం, పాస్ఫరస్‌ తొమ్మిది శాతం, విటమిన్‌ ఏ ఆరు శాతం, విటమిన్‌ బి2 15శాతం, బీ5 ఏడు శాతం, బీ12 తొమ్మిది శాతం ఉంటాయి. వీటితోపాటు విటమిన్‌ డి, ఈ, కె, కాల్షియం, జింక్‌ లాంటి ఖనిజాలు లభిస్తాయి.