Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అసలే వర్షాకాలం.. ఆహారంలో శుభ్రత అవసరం.. ఈ టిప్స్ పాటించండి

మంగళవారం, 31 అక్టోబరు 2017 (12:14 IST)

Widgets Magazine

అసలే వర్షాకాలం.. తీసుకునే ఆహారంలో శుభ్రత అవసరం. మనం తీసుకునే ఆహారం కలుషితమైతే.. కడుపునొప్పి, విరేచనాల వంటి సమస్యలెన్నో వేధిస్తాయి. కాబట్టి భోజనం చేయటానికి ముందు మాత్రమే కాదు.. ఆహారం వండటానికి ముందూ చేతులను బాగా శుభ్రం చేసుకోవాలి. అంతేకాదు.. కూరగాయలను పచ్చి మాంసం వంటి వాటితో కలవకుండా చూసుకోవాలి. 
 
లేనట్లైతే మాంసానికి అంటుకుని ఉండే  బ్యాక్టీరియా వంటివి కూరగాయలకు వ్యాపించే ప్రమాదం వుంది. అలాగే వర్షాకాలంలో ఆహారాన్ని వేడివేడిగా తీసుకోవడం మంచిది. ఫ్రిజ్‌లో నిల్వ వుంచిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోకపోవడం మంచిది. వండిన పదార్థాలను వేడి వాతావరణంలో గంట కన్నా ఎక్కువసేపు బయట ఉంచితే వాటిల్లో బ్యాక్టీరియా వృద్ధి చెందే అవకాశముంది. దీంతో అది కలుషితమై రకరకాల అనర్థాలకు దారితీయొచ్చు. 
 
అందుకే ఓ పూటకు ఆ పూట వండుకుని తినడం మంచిది. వండి నిల్వ వుంచిన మాంసాహారంతోనే కాకుండా.. కూరగాయలతో చేసే ఇతర ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా అనర్ధాలు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
 
అలాగే వర్షాకాలంలో వేడి వేడి సూప్‌లు, వేడి నీరు తీసుకోవడం మంచిది. వ్యాధినిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని, పండ్లు, కూరగాయలను తీసుకోవాలి. నూనెతో వేయించిన ఆహార పదార్థాలు, గ్రిల్డ్ తండూరీ పదార్థాలను తీసుకోకపోవడం మంచిది. వంటకాల్లో మిరియాలు, అల్లం, పసుపు, కొత్తిమీర, జీలకర్ర చేర్చుకోవాలి. ఓట్స్, శెనగలు, మొక్కజొన్న వంటి ఫైబర్ ఫుడ్స్ తీసుకోవాలి. ఊరగాయలు, పచ్చళ్లు ఎక్కువ తీసుకోకూడదు. 
 
తేనేను వాడటం ద్వారా అనారోగ్య సమస్యలు ఉత్పన్నం కావు. హోటళ్లు, బయటి చిరుతిళ్లను తినడం మానేయాలి. సిట్రస్ ఫ్రూట్స్ అయిన ఆరెంజ్‌ను తీసుకోవచ్చు. మొత్తంగా ఒకేసారి కాకుండా.. నాలుగైదు సార్లు పరిమితంగా ఆహారం తీసుకోవడం ద్వారా వర్షాకాలం అజీర్తిని దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

భోజనానికి ముందు వెజ్ జ్యూస్ తాగితే ఏమౌతుంది...?

బరువు తగ్గాలా? వర్షాకాలంలో ఏర్పడే రుగ్మతల నుంచి దూరం కావాలా అయితే భోజనానికి ముందు ఒక ...

news

ఆఫీసుల్లో గంటల కొద్దీ కూర్చుంటున్నారా? కీళ్ల నొప్పులకు ఇలా చేయండి..

ఆఫీసుల్లో గంటల కొద్దీ కూర్చుంటున్నారా..? కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారా? అయితే వీటి ...

news

భోజనం తరువాత ఒక్క స్పూన్ సోంపు తింటే...?

సోంపుకు కొలెస్ట్రాల్‌కు ఉన్న లింకేంటి. సోంపు అంటే కొంతమంది ఇష్టపడతారు... మరికొంతమంది ...

news

పాద మర్దనం... ఎన్ని ఫలితాలో తెలుసా?

శరీరంలో జరిగే క్రియలకు, అరికాళ్లకు అవినాభావ సంబంధం ఉంది. ప్రతి రోజు అరికాళ్లను మసాజ్ ...

Widgets Magazine