శుక్రవారం, 15 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 11 సెప్టెంబరు 2017 (12:34 IST)

మధుమేహులు ఆపిల్ పండు తీసుకుంటే.. ఇన్ఫెక్షన్లుండవ్

మధుమేహ వ్యాధిగ్రస్థులు పండ్లు తీసుకోవాలంటేనే జడుసుకుంటారు. జ్యూస్‌ల రూపంలో పండ్ల రసాలను తీసుకుంటే డయాబెటిస్‌ పేషెంట్లకు అంతమంచిది కాదని తద్వారా చక్కెర స్థాయిలు పెరిగిపోతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు

మధుమేహ వ్యాధిగ్రస్థులు పండ్లు తీసుకోవాలంటేనే జడుసుకుంటారు. జ్యూస్‌ల రూపంలో పండ్ల రసాలను తీసుకుంటే డయాబెటిస్‌ పేషెంట్లకు అంతమంచిది కాదని తద్వారా చక్కెర స్థాయిలు పెరిగిపోతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే ఆరెంజ్, బేరిపండు, ఆపిల్, ద్రాక్షలను డయాబెటిస్ పేషెంట్లు తీసుకోవచ్చునని.. అవి కూడా మోతాదు మించకూడదని వారు సూచిస్తున్నారు. 
 
రోజుకో ఆపిల్ పండును మధుమేహ వ్యాధిగ్రస్థులు తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు త్వరగా ఇన్ఫెక్షన్లకు గురవుతుంటారు. ఆపిల్‌లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ కారకాలు ఇన్ఫెక్షన్లను పక్కనబెడుతుంది. ఇందులో గ్లైసిమిక్ విలువలు తక్కువగా వుండటం ద్వారా పంచదార స్థాయిలు పెరగవు. 
 
అలాగే బేరిపండ్లలోనూ చక్కెర స్థాయిలు మితంగా వుంటాయి. విటమిన్, మినరల్, ఫైబర్‌లను అధికంగా కలిగి ఉండే బేరిపండు రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించటమే కాకుండా, కొవ్వు పదార్థాల స్థాయిలను కూడా తగ్గిస్తుంది. కావున మధుమేహులు తప్పక ఈ పండును తినాలి. 
 
ద్రాక్షపండ్లలోని నారిన్జేనిన్ అనే పదార్థం రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. కొవ్వు పదార్థాలను తగ్గిస్తుంది. కేన్సర్ వ్యాధిని నివారిస్తుంది. నారింజ పండు కూడా మధుమేహుల్లో వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులోని విటమిన్ సి, ఫైబర్ చక్కెర స్థాయిలను, కొవ్వు పదార్థాలను తగ్గిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.