Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అంజీరను వెన్నతో కలుపుకుని తీసుకుంటే? శృంగార సమస్యలుండవ్

గురువారం, 1 జూన్ 2017 (13:08 IST)

Widgets Magazine
Anjira fruit

అంజీర పండును సలాడ్స్, ఓట్ మీల్, చట్నీలు, సల్సా, పాస్తాల్లో కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. ప్రత్యేకించి రక్తహీనతను దూరం చేసుకోవచ్చు. రక్తహీనత అనగానే  ఐరన్‌ ట్యాబ్లెట్లను తీసుకోవడం కంటే సహజసిద్ధమైన అంజీరను తీసుకోవడం మంచిది. 
 
అంజీర పండులో  పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్‌తో పాటు కావలసినంత  పీచుపదార్థం కూడా ఉంటుంది. పలురకాల పోషకాలతో పాటు శరీరానికి ఎంతో మేలు చేసే ఫైటో కెమికల్స్‌ కూడా సమృద్ధిగా ఉంటాయి. ఎండు పండ్లలో అత్యధికంగా పోషకాలు అంజీరలోనే అధికంగా ఉన్నట్లు ఇటీవలి సర్వేలు తేల్చాయి. తరచూ జలుబు చేసిందంటే ఈ అంజీరపు పళ్ళ రసం తాగితే మంచి ఫలితం ఉంటుంది. మహిళలు రోజు రెండు పళ్ళు తింటే మొటిమలు తగ్గుతాయి. సౌందర్యం మెరుగవుతుంది. నిత్యయవ్వనులుగా ఉండాలంటే.. అంజీర పండును తప్పకుండా తీసుకోవాల్సిందే.
 
అంజీర ఫలం‌లో కొవ్వు, పిండిపదార్థాలు, సోడియం వంటి లవణాలు తక్కువగా ఉంటాయి. ఖనిజాలు, పీచు, విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయి. పాలు, పాల పదార్థాలు పడని వారు వీటిని పది నుంచి పన్నెండు చొప్పున తీసుకుంటే శరీరానికి క్యాల్షియం, ఐరన్ అందుతాయి. అత్తిపండ్లు దాంపత్య జీవితానికి ఎంతో మేలు చేస్తాయి. శృంగార సమస్యలను దూరం చేస్తాయి. వీటిని నేరుగా లేకుంటే బాదం, ఖర్జూరం వంటి ఇతర ఎండు ఫలాలతోగాని వాడుకోవచ్చు. వెన్నతో కలిపి తీసుకుంటే వీటి శక్తి ఇనుమడిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

మీ మెడ చండాలంగా ఉందా.. అయితే ఇది చేయండి..?

మహిళలు అందం విషయంలో ముఖానికి ఇచ్చిన ప్రాముఖ్యత మెడకు ఇవ్వరు. అందుకే చాలామంది స్త్రీల మెడ ...

news

అసిడిటి పోవాలంటే చాలా ఈజీ.. ఎలా?

ఈ మధ్యకాలంలో ఎసిడిటితో బాధపడేవారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఎసిటిడితో బాధపడేవారికి తక్షణం ...

news

రాత్రిపూట అన్నం అస్సలు తినకూడదట..? ఎందుకని?

రాత్రిపూట అన్నం అస్సలు తీసుకోకూడదట. దీనివల్ల శరీరంలో అదనపు కొవ్వు చేరుతుంది. మధ్యాహ్నం ...

news

వేడినీటిని తాగండి.. బరువు తగ్గండి.. కేశాలకు, చర్మానికి కూడా..?

వేడినీటిని తీసుకోవడం ద్వారా అనసరంగా బరువు పెరగడం, ఒబిసిటీకి గురవడం జరగదని ఆరోగ్య నిపుణులు ...

Widgets Magazine