మునగతో ఆ సామర్థ్యం పెరుగుతుంది.. చర్మం కాంతివంతంగా..

శనివారం, 2 డిశెంబరు 2017 (13:35 IST)

మునగను వారానికి రెండు సార్లు ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యానికి బోలెడు ప్రయోజనాలు లభిస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మునగ ఆకు, మునగ కాయల్లో ఐరన్ పుష్కలంగా వుండటమే ఇందుకు కారణం.

మునగాకును ఎండబెట్టినా అందులోని పోషకాలు ఏమాత్రం నశించవు. మునగాకును శుభ్రంగా ఎండబెట్టి కరివేపాకు పొడిలా తయారు చేసుకుని వేడివేడి అన్నంలో కలుపుకుని తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలు దరిచేరవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మునగకాయల్లో జింక్ ఎక్కువగా ఉంటుంది. 
 
ఇది పురుషుల్లో శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. వీర్యం వృద్ధి చెందేలా చేస్తుంది. దీంతో సంతానలేమి దూరమవుతుంది. ఇంకా వారానికి మూడు సార్లు మునగకాయల్ని వంటల్లో చేర్చుకోవడం ద్వారా చర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. చర్మ సమస్యలు పోతాయి. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. 
 
మునగకాయల్లో ఉండే విటమిన్ సి అనారోగ్య రుగ్మతలను దూరం చేస్తుంది. మధుమేహం ఉన్నవారికి మునగ ఎంతో మేలు చేస్తుంది. మునగకాయలను వారానికి ఐదుసార్లు తీసుకుంటే మధుమేహాన్ని నియంత్రించుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

పొట్ట తగ్గాలంటే సాల్మన్ చేపలు తినండి..

పొట్టతగ్గాలంటే సాల్మన్ చేపలు తినాలని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఈ చేపలను డైట్‌లో ...

news

కోడిగుడ్లను ఉడకబెట్టి తింటే మేలెంత?

కోడిగుడ్ల ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. కోడిగుడ్లలో వుండే పొటాషియం, విటమిన్ ...

news

గోధుమలు, జొన్నలు, రాగుల్ని పొట్టు తీయకుండానే?

బీరకాయ, చిక్కుడు, గోరుచిక్కుడు, ములగకాడలు, అరటిదూట, పనసకాయ వంటి పదార్థాలను వంటల్లో ...

news

మానసిక ఒత్తిడి నుంచి వెంటనే ఉపశమనం కోసం ఒక గ్లాస్ ఆ రసం...

పుదీనాలో చాలా ఔషధ గుణాలున్నాయి. పుదీనా ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. ...