శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chitra
Last Updated : బుధవారం, 24 ఆగస్టు 2016 (09:39 IST)

యాంటీ ఏజింగ్ లక్షణాలకు చెక్ పెట్టాలా? మొలకెత్తిన ధాన్యాలు తినండి

మన శరీరానికి పోషకాలను అందించడంలో మొలకెత్తిన ధాన్యాలు ముఖ్య పాత్రను వహిస్తుంది. ఇందులో ముఖ్యమైనవి పెసలు. పప్పు ధాన్యాల జాతికి చెందిన పెసలలో విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్స్ అధికంగా ఉన్నాయి. దీంతోపాటు ఫై

మన శరీరానికి పోషకాలను అందించడంలో మొలకెత్తిన ధాన్యాలు ముఖ్య పాత్రను వహిస్తుంది. ఇందులో ముఖ్యమైనవి పెసలు. పప్పు ధాన్యాల జాతికి చెందిన పెసలలో విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్స్ అధికంగా ఉన్నాయి. దీంతోపాటు ఫైబర్ వీటిలో అధిక శాతంలో లభిస్తుంది. పెసలను మొలకెత్తిన గింజల రూపంలో నిత్యం తీసుకుంటే అది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని న్యూట్రిషనిస్టులు అంటున్నారు. 
 
మొలకెత్తిన పెసలు తీసుకోవడం వల్ల దృష్టి సంబంధ సమస్యలు కూడా తొలగిపోతాయి. గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. రక్తహీనత తొలగిపోవడంతోపాటు జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. మన రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించే గుణం మొలకెత్తిన పెసలలో పుష్కలంగా ఉంది. అంతేకాకుండా పలురకాల క్యాన్సర్లను అడ్డుకునే కారకాలు పెసలలో ఉన్నాయి. గ్యాస్, అజీర్ణం వంటి ఇబ్బందులు తొలగిపోతాయి. మొలకెత్తిన పెసలను నిత్యం తీసుకుంటే శరీరానికి కావల్సిన పోషకాలు అందడమే కాకుండా మన శరీరం ఎటువంటి వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది.
 
 
రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించే గుణం మొలకెత్తిన పెసలకు ఉంది. అంతేకాదు యాంటీ ఏజింగ్ గుణాలు కూడా వీటిలో ఉన్నాయి. ఇవి వృద్ధాప్యం కారణంగా వచ్చే ముడతలను తగ్గిస్తాయి. శరీరంలో ఏర్పడే ఇన్‌ఫెక్షన్లను తొలగించే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పెసలలో ఉన్నాయి. ఇవి కణజాలాల నాశనాన్ని అడ్డుకుంటాయి.