Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

థైరాయిడ్, మధుమేహాన్ని నియంత్రించే సన్‌ఫ్లవర్ ఆయిల్

సోమవారం, 4 డిశెంబరు 2017 (12:29 IST)

Widgets Magazine

పొద్దు తిరుగుడు నూనె, అదేనండి సన్ ఫ్లవర్ ఆయిల్‌ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సలాడ్లూ కూరలూ బ్రెడ్డూ కేకుల్లో సన్‌ఫ్లవర్ గింజల పొడిని చల్లుకోవడం లేదా విడిగా కాస్త వేయించుకుని స్నాక్స్‌ రూపంలో తీసుకోవడం మంచిది. ఇలా చేయడం ద్వారా అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఇందులో పాంటోథెనిక్‌ ఆమ్లం శాతం ఎక్కువ వుండటం ద్వారా జీవక్రియా వేగం పెరుగుతుంది. హర్మోన్ల సమతౌల్యానికీ మెదడు పనితీరుకీ తోడ్పడుతుంది. 
 
ఇక ఈ గింజలు ఇన్సులిన్‌ నిరోధానికి సాయపడుతూ మధుమేహం రాకుండా అడ్డుకుంటాయి. పొద్దుతిరుగుడు గింజలు థైరాయిడ్‌ను దరిచేరనివ్వదు. ఇంకా పొద్దుతిరుగుడు గింజలు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడం ద్వారా హానికర ఫ్రీరాడికల్స్‌ విడుదలను అడ్డుకుంటాయి. తద్వారా క్యాన్సర్, హృద్రోగాలకు దూరం చేసుకోవచ్చు. పొద్దు తిరుగుడు గింజలు, నూనెల ద్వారా శిరోజాల పెరుగుదలకు తోడ్పడుతాయి. 
 
అలాగే పొద్దు తిరుగుడు గింజలను దీని ఆకురసంతో నూరి ముద్దగా చేసి మూడు రోజులు వరుసగా నుదుటి మీద పట్టివేస్తే మైగ్రేన్‌ తగ్గుతుంది. పొద్దు తిరుగుడు వేరుకు సమానంగా, వెల్లుల్లి కలిపి, ముద్దగా నూరి, కంఠానికి పట్టీగా కట్టుకడితే గాయిటర్‌ తగ్గుతుంది.
 
పొద్దు తిరుగుడు గింజల చూర్ణానికి సమానంగా, చక్కెర పొడి కలిపి ఐదు గ్రాముల మోతాదులో రోజుకు రెండు పూటలా సేవిస్తే, అర్శమొలలు తగ్గుతాయి. మూడు గ్రాముల గింజల చూర్ణాన్ని రెండు పూటలా సేవిస్తే కడుపులోని నులిపురుగులు నశిస్తాయని ఆయుర్వేదం చెప్తోంది.  



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

ఆత్మహత్యలను ప్రేరేపిస్తున్న స్మార్ట్ ఫోన్లు..

స్మార్ట్ ఫోన్ల వినియోగం ప్రస్తుతం ఓ వ్యసనంలా మారిపోయింది. స్మార్ట్ ఫోన్ వినియోగదారుల్లో ...

news

జీన్స్ వేసుకుంటే.. వామ్మో ఎన్నో సమస్యలు..

ఫ్యాషన్ పేరిట జీన్స్ వేసుకుంటున్నారా? కంఫర్ట్‌బుల్ కోసం వాటిని పదే పదే వాడుతున్నారా? ...

news

ఆకుకూరలతో ఆయుష్షు పెంచుకోండి..

అవునండి.. ఆకుకూరలతో ఆయుష్షును పెంచుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆకుకూరలను ...

news

మునగతో ఆ సామర్థ్యం పెరుగుతుంది.. చర్మం కాంతివంతంగా..

మునగను వారానికి రెండు సార్లు ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యానికి బోలెడు ప్రయోజనాలు ...

Widgets Magazine