శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 16 నవంబరు 2015 (17:05 IST)

సాయంత్రం 5 గంటలకి తర్వాత అతి ఆహారం తినకండి..!

రోజులో కొంచెం కొంచెంగా నాలుగు నుంచి ఆరుసార్లు తినడం మంచిది. ఎలాగూ ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం రాత్రి భోజనం చేస్తుండటం.. మధ్య మధ్యలో పండ్లు తినడం అలవాటు చేసుకోవాలి. సాయంత్రం ఐదు గంటలకు తర్వాత అతి ఆహారం అనర్థదాయకమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వీలైనంత వరకు మొబైల్ వాడకాన్ని తగ్గించండి. అవసరమైతే మెసేజ్‌లు పంపడం అలవాటు చేసుకోండి. చార్జింగ్ పెట్టినప్పుడు ఫోనులో మాట్లాడకండి. చార్జింగ్, సిగ్నల్ తక్కువగా ఉన్నప్పుడు మాట్లాడితే రేడియేషన్ ముప్పు ఎక్కువని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
 
ఉదయం కనీసం అరగంట నడవండి. రోజూ టూత్‌ఫేస్ట్‌తో కాకుండా వారానికి కనీసం రెండుసార్లు వేపపుల్లతో పండ్లు తోమండి. ఫేస్ వాష్ చేసుకున్నాక  పరగడుపున 3 గ్లాసుల నీరు తాగండి. గోరువెచ్చటి నీటితో స్నానం చేయడం మంచిది. అతి చల్లని, వేడి నీటితో స్నానం హానికరం. అల్పాహారంలో  నూనె పదార్థాలు తినకండి. ఇడ్లి, దోసెలాంటివి తిన్నా ఫర్వాలేదుగానీ వాటికంటే పండ్లు, పాలు, మొలకెత్తిన విత్తనాలు, డ్రైఫ్రూట్స్ తినడం మంచిది.