శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chitra
Last Updated : సోమవారం, 8 ఫిబ్రవరి 2016 (12:14 IST)

చిన్నపాటి వ్యాయామాలతో సంపూర్ణ ఆరోగ్యం

ఇప్పుడున్నబిజీ జీవితంలో ఎవ్వరూ ఆరోగ్యంపై పెద్దగా శ్రద్ద చూపడం లేదు. కొంతసమయం ఉన్న వారు మాత్రం ఆరోగ్య పరిరక్షణకు విపరీతమైన ఒత్తిడితో కూడిన వ్యాయామ పరికరాలతో ఎక్స్‌ర్‌సైజులు చేస్తున్నారు. ఇలాంటి వారు కొంత కాలం ఉపయోగించి ఆ తర్వాత మానేస్తున్నారు.
 
మరికొందరు ఎలాంటి వ్యాయామాలు చేయకుండా బరువు పెంచుకుంటూ మరింత లావెక్కుతున్నారు. ఆ తర్వాత ఈ బరువును తగ్గించుకునేందుకు డైటింగ్‌లు మొదలుపెడతారు. ఇలా అన్నీ సగం సగం చేయడం వలన సమతుల్యంగా ఉండాల్సిన ఆరోగ్యం కాస్తా ఒడిదుడుకులకు గురవుతోంది. దీంతో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. 
 
ఇలాంటి వారు భారీ ఎక్సర్‌సైజుల జోలికి వెళ్లకుండా చిన్నపాటి వ్యాయామాలు చేసినట్టయితే ఆరోగ్యం పరిరక్షించుకోవచ్చని వైద్యులు సలహా ఇస్తున్నారు. ఈ చిన్నపాటి వ్యాయామాల్లో సూర్య నమస్కారాలు, ప్రాణాయామముతో కూడిన యోగాసనాలు వంటివి దినచర్యలో భాగంగా చేసుకోవడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉండొచ్చని వైద్యులు సలహా ఇస్తున్నారు.