ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 8 మార్చి 2019 (22:15 IST)

జీర్ణవ్యవస్థ నిరంతరం ఇబ్బంది లేకుండా పనిచేయాలంటే...?

జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగ్గా ఉండాలంటే భోజనం తరువాత కొన్ని పనులకు దూరంగా ఉండాలంటున్నారు వైద్య నిపుణులు. అలా చేస్తే అరుగుదల బాగా జరుగుతుందట. అంతేకాదు జీర్ణవ్యవస్థ మీద ఎలాంటి ఒత్తిడి ఉండదట. కొందరు రాత్రిపూట భోజనం చేశాక స్నానం చేస్తుంటారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఒకటిరెండుసార్లు చేయొచ్చు. అదే అలవాటుగా మారితే స్నానం వల్ల కదలికలు వేగంగా ఉంటాయట.
 
ఆ ప్రభావం జీర్ణవ్యవస్థ మీద పడుతుందట. అరుగుదల మందగిస్తుంది. షవర్‌తో స్నానం చేయడం అస్సలు మంచిది కాదట. నీళ్ళు తాగడం వల్ల ఒత్తిడి జీర్ణవ్యవస్ధపై పడుతుంది. అన్నం తిన్నాక కాసేపు అలా ఇలా నడుస్తూ ఉండాలట. అలాగని ఎక్కువసేపు నడవడం మంచిది కాదట. ఇలా చేయడం వల్ల కొంతమంది వికారం కలగవచ్చు. మరికొందరికి పొట్టలో తిప్పే ప్రమాదం ఉందట. 
 
భోజనం చేశాక రాత్రి పూట చల్లటి నీళ్ళు తాగితే అరుగుదల మీద ప్రభావం చూపుతాయట. అదే గోరువెచ్చని నీళ్ళు తాగితే జీర్ణవ్యవస్ధ పనితీరును వేగవంతం చేస్తాయట. భోజనం చేసిన తరువాత తినడం మంచిది కాదు. తినడానికి..పడుకోవడానికి మధ్య కనీసం గంటన్నర సమయం ఉండాలట. తిన్న వెంటనే పడుకుంటే శరీరంలో కొవ్వు పేరుకుపోయే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. భోజనం చేశాక టీ, కాఫీలు అస్సలు తాగకూడదట. అలా తాగితే పోషకాహారాలు వంటబట్టవని చెపుతున్నారు.