టీవీల ముందు గంటల పాటు కూర్చునే మగాళ్లా మీరు? బీ కేర్ ఫుల్

ఆఫీసు నుంచి వచ్చాక.. లేదంటే సెలవు దినాల్లో పురుషులు గంటల గంటలు టీవీల ముందు కూర్చుంటున్నారా? అయితే సంతానలోపం తప్పదంటూ హెచ్చరిస్తున్నా ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా కొత్తగా పెళ్లైన పురుషులు రోజుకు ఐదు గంటలప

tv watching
selvi| Last Updated: బుధవారం, 31 జనవరి 2018 (11:06 IST)
ఆఫీసు నుంచి వచ్చాక.. లేదంటే సెలవు దినాల్లో పురుషులు గంటల గంటలు టీవీల ముందు కూర్చుంటున్నారా? అయితే సంతానలోపం తప్పదంటూ హెచ్చరిస్తున్నా ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా కొత్తగా పెళ్లైన పురుషులు రోజుకు ఐదు గంటలపాటు కదలకుండా ఒకేచోట కూర్చుంటే.. వారిలో సంతానం కలిగే అవకాశాలు తగ్గిపోతాయని తాజా అధ్యయనంలో తేలింది.

టీవీల ముందుకు కూర్చునే పురుషుల్లో వీర్యంలో శుక్రకణాల శాతం 35శాతం మేర తగ్గిపోతుందట. టీవీలు చూస్తూ గంటల సమయాన్ని వృధా చేసేవారికంటే.. వ్యాయామం చేస్తూ చలాకీగా తిరిగే వాళ్లలో వీర్యకణాల శాతం ఎక్కువ వున్నట్లు పరిశోధకులు తెలిపారు.

చలాకీగా చురుగ్గా వుండే వారిలో శారీరక దృఢత్వంతో పాటు సంతాన లోపం వుండదని.. ఆరోగ్యంగా వుంటారని తేలింది. కాబట్టి గంటల పాటు టీవీలకు అతుక్కుపోయే పురుషులు ఇకనైనా జాగ్రత్తగా వుండాలి మరి.


దీనిపై మరింత చదవండి :