మీ ఇంట్లో పూలచెట్లు లేవా...? ఐతే ఆ శక్తి...

గురువారం, 11 మే 2017 (20:33 IST)

ఇప్పుడు చదువులు, ఉద్యోగాలు, తర్వాత పెళ్లిళ్లు... పిల్లలు... ఇలా బిజీ అయిపోతున్నారు. అమ్మాయిలు ఇదివరకు చక్కగా పూలను తలనిండా పెట్టుకుని కనిపించేవారు. ఇప్పుడలాంటి పరిస్థితి కనిపించడంలేదు. తలలో పూలు పెట్టుకుని కార్యాలయాలకు, పాఠశాలలకు వెళ్లే పరిస్థితి పోయింది. దీనితో పూలచెట్లను పెంచడం, వాటి అందాలను చూస్తూ ఆ పూలను కోసి తలలో తురుముకోవడం తగ్గిపోయింది. ఈ ప్రభావం వారిపై పడుతుంది. ఇంట్లో కనీసం తక్కువ స్థలంలోనే పూలను పెంచుకునే అవకాశం వున్నా ఆ పని చేయడంలేదు. 
 
ఇలాంటివారు వెంటనే పూలచెట్లు పెంపకంపై దృష్టి పెట్టాలంటోంది హార్వర్డ్ యూనివర్శిటీ. ఎందుకంటే వారు చేసిన పరిశోధనల్లో ఇంట్లో ప్రతిరోజూ పువ్వుల సువాసనలు, అందాన్ని ఆస్వాదించగలిగేవారు మిగతావారికంటే శక్తివంతంగా, ఉత్సాహవంతంగా వుంటున్నారని తేలింది. అంతేకాదు.... వీరిలో ఆందోళనా శాతం కూడా చాలా తక్కువగా వున్నట్లు కనుగొన్నారు. పూల సువాసనలు, అందం మెదడులో కొత్త శక్తిని నింపుతాయని వారు చెపుతున్నారు. ఇంకెందుకాలస్యం... వెంటనే పూలచెట్లను పెంచేయండి.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

పుట్టబోయే బిడ్డ అబ్బాయా.. అమ్మాయా.. ఇలా తెలుసుకోవచ్చు

పుట్టబోయే బిడ్డ ఆడా మగా అనేది తెలుసుకోవాలనే కుతూహలం అందరికీ వుంటుంది. అయితే తల్లి బీపీ ...

news

ఊబకాయంతో బాధపడేవాళ్లకు మేలు చేసే బిర్యానీ ఆకులు

బిర్యానీ ఆకుల గురించి మహిళలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే బిర్యానీ ఆకులను ...

news

మధుమేహం ఉన్నవాళ్లు మామిడిపండు ముట్టకూడదా.. ఎవరు చెప్పారు?

మామిడి పండు ఫలాల్లో శ్రేష్టమైన పండు. దీంట్లో విటమిన్ ఎ, విటమిన్ సి, ఫైబర్, ...

news

గుమ్మడి గింజలు, అవిసె గింజలు, నువ్వులు ఏంటి ప్రయోజనం?

గుమ్మడి, అవిసె, నువ్వుల్లో పోషకాలు వున్నాయి. ఓ కప్పు వేయించిన గుమ్మడి గింజల్లో 168 మిల్లీ ...