శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chitra
Last Updated : గురువారం, 4 ఫిబ్రవరి 2016 (11:35 IST)

నిద్రా సమయం హెచ్చు తగ్గులుగా ఉందా.. అయితే గుండె పోటు తప్పదు!

సాధారణంగా మనకు రోజుకి ఎన్ని గంటలు నిద్ర సరిపోతుంది. అసలు ఎన్నిగంటలు నిద్రపోవాలి. ఎక్కువ సమయం నిద్రపోతే ఏం జరుగుతుంది. అలాగే తక్కువ సమయం నిద్రపోతే ఉపయోగాలేంటి. అసలు ప్రశాంతంగా నిద్రపోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటివి తెలుసుకావాలంటే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే...
 
ఒక రోజులో మనిషికి 8 గంటల ప్రశాంతమైన నిద్ర పోవాలంటారు వైద్య నిపుణులు. నిద్ర అంతకన్నా ఎక్కువైనా.. తక్కువైనా ప్రమాదమేనని శాస్త్రవేత్తలు తమ తాజా పరిశోధనలో తేల్చారు. అంతేకాదు, నిద్ర హెచ్చు తగ్గుల కారణంగా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. 
 
రోజుకి 7 గంటలు నిద్రపోయే వారితో పోలిస్తే 9 గంటలకుపైగా నిద్రపోయే వారికి గుండె సంబంధింత సమస్యలు ఒకటిన్నర రెట్లు అధికంగా ఉంటుందని తెలిపారు. ఎవరైతే 5 గంటలు లేదా అంతకన్నా తక్కువ సమయం నిద్రించే 60 ఏళ్ళ వయస్సు ఉన్న వారిలో ఈ సమస్యలు మూడింతలు అధికంగా ఉన్నట్లు వెల్లడించారు.
 
ఈ పరిశోధన ప్రకారం, తక్కువ సమయం నిద్రించేవారు శ్వాస ఆడకపోవటం వంటి సమస్యతో, అలాగే ఎక్కువ లేదా తక్కువ సమయం నిద్రించేవారు గుండెపోటు, పక్షవాతం బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు తెలిపారు.