శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 26 అక్టోబరు 2016 (17:09 IST)

స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా? బ్యాటరీలతో యమా డేంజర్.. విషవాయువులు..?

సోషల్ మీడియా ప్రభావంతో ఇంటర్నెట్ వాడకం బాగా పెరిగిపోయింది. ఇంటర్నెట్ వాడకం కోసం డెస్క్ టాప్‌లను గతంలో తెగవాడేవారు. అయితే ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లకు భారీ క్రేజ్ ఉండటంతో ఇంటర్నెట్ వినియోగం అమాంతం పెరిగి

సోషల్ మీడియా ప్రభావంతో ఇంటర్నెట్ వాడకం బాగా పెరిగిపోయింది. ఇంటర్నెట్ వాడకం కోసం డెస్క్ టాప్‌లను గతంలో తెగవాడేవారు. అయితే ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లకు భారీ క్రేజ్ ఉండటంతో ఇంటర్నెట్ వినియోగం అమాంతం పెరిగిపోతోంది. కానీ స్మార్ట్ ఫోన్‌లతో తలనొప్పేనని.. వాటిలో వినియోగించే బ్యాటరీల ద్వారా ఆరోగ్యానికి చేటేనని తాజా అధ్యయనంలో తేలింది.

తాజాగా అమెరికాలోని ఓ యూనివర్శిటీ నిర్వహించిన పరిశోధనలో స్మార్ట్‌పోన్ల బ్యాటరీలు వందకుపైగా విష వాయువులను వెదజల్లుతున్నాయని తేలింది. ట్యాబ్‌లెట్‌లాంటి పరికరాల్లో వాడే బ్యాట‌రీల్లోనూ ఈ విష‌వాయువులు ఉన్నట్లు పరిశోధకులు వెల్లడించారు. 
 
అంతేగాకుండా ఈ వాయువులు ప్రాణాంతకమైనవని వారు హెచ్చరిస్తున్నారు. ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఉపయోగించే బ్యాటరీల్లో ముఖ్యంగా లిథియమ్ బ్యాటరీలు వందకు పైగా విషవాయువుల్ని వెదజల్లుతున్నామని తాజా అధ్యయనంలో స్పష్టమైంది. వాటిల్లో కార్బన్‌ మోనాక్సైడ్ ఉందని.. దీని ప్రభావంతో చర్మవ్యాధులు తప్పవని, కళ్లు, శ్వాస సంబంధ రుగ్మతలు తప్పవని పరిశోధకులు హెచ్చరించారు. 
 
ఎన్బీసీ డిఫెన్స్ అండ్ చైనాకు చెందిన సింగువా యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు జరిపిన ఈ పరిశోధనలో.. రీకాల్ బ్యాటరీలతో ఎలక్ట్రానిక్ వస్తువులకు ముప్పేనని.. ఇటీవల గ్యాలెక్సీ నోట్ 7ను శామ్‌సంగ్ సంస్థ ఆపేయడానికి కూడా రీకాల్ బ్యాటరీలే కారణమని పరిశోధకులు చెప్తున్నారు. లిథియమ్ బ్యాటరీలనే చాలామంది ఉపయోగిస్తున్నారని.. వీటి నుంచి అధికశాతం టాక్సిక్ గ్యాసులు ఉత్పత్తి అవుతున్నాయని పరిశోధకులు కనిపెట్టారు.