శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 15 జులై 2016 (17:09 IST)

రెడ్ మీట్ వద్దే వద్దు.. చేపలు, గుడ్లు, కూరగాయలే ముద్దు..!

వీకెండ్ వచ్చేస్తే చాలు.. ఇంకేముంది నాన్ వెజ్ లాగేంచేస్తున్నారా? అయితే మీకో బ్యాడ్ న్యూస్. మాంసాహారాన్ని మితంగా తినకపోతే కిడ్నీ ఫెయిలయ్యే ప్రమాదం పొంచివుందని పరిశోధకులు అంటున్నారు. మాంసాహారం మితంగా తీస

వీకెండ్ వచ్చేస్తే చాలు.. ఇంకేముంది నాన్ వెజ్ లాగేంచేస్తున్నారా? అయితే మీకో బ్యాడ్ న్యూస్. మాంసాహారాన్ని మితంగా తినకపోతే కిడ్నీ ఫెయిలయ్యే ప్రమాదం పొంచివుందని పరిశోధకులు అంటున్నారు. మాంసాహారం మితంగా తీసుకునే వారిలో కిడ్నీ పనితీరు మెరుగ్గా ఉందని.. అదే మాంసాహారాన్ని వారానికి మూడుసార్లు లాగించేవారిలో కిడ్నీ సంబంధిత వ్యాధులు ఉన్నట్లు వూన్ పూయేకోహ్ ఆధ్వర్యంలోని పరిశోధనలో తేలింది. 
 
ఈ బృందం సింగపూర్ లోని 63,257 మంది చైనా దేశీయులను అధ్యయనం చేసింది. 97 శాతం మంది ప్రొటీన్లు అధికంగా ఉన్న మాంసం తిన్నవారిలో కిడ్నీల పనితీరు ప్రమాదంలో ఉన్నట్లు తేలిపోగా, చేపలు, గుడ్లు డైరీ ఉత్పత్తులు తీసుకునే వారికంటే మాంసాహార ప్రియుల్లో ఈ ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. 
 
అంతేగాకుండా పంది, మేక, గొర్రె, ఆవు మాంసం తిన్నవారిలో కిడ్నీలు ఫెయిలయ్యే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. రెడ్ మీట్‌కు బదులు చేపలు, కోడి మాంసం తీసుకోవచ్చునని తద్వారా కిడ్నీ సమస్యలను దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇక కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడే వారు ఆకుకూరలు ఎక్కువగా తినాలని పరిశోధకులు తెలిపారు.