శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Kowsalya
Last Updated : మంగళవారం, 5 జూన్ 2018 (13:38 IST)

రాత్రివేళ సుఖంగా నిద్రపట్టడం కోసం తీసుకోవలసిన జాగ్రత్తలు.....

నేటి జీవితంలో 8 గంటల పని తరువాత ఇంటికి వచ్చి కాసేపు పిల్లలతో గడిపి హాయిగా నిద్రపోయే పరిస్థితులు కరువవుతున్నాయి. అందుకే నిద్ర సుఖమెరుగదు అని అలనాటి పెద్దలు అంటున్నారు. ప్రపంచంలో ఏ దేశంలో అయినా సరే నింప

నేటి జీవితంలో 8 గంటల పని తరువాత ఇంటికి వచ్చి కాసేపు పిల్లలతో గడిపి హాయిగా నిద్రపోయే పరిస్థితులు కరువవుతున్నాయి. అందుకే నిద్ర సుఖమెరుగదు అని అలనాటి పెద్దలు అంటున్నారు. ప్రపంచంలో ఏ దేశంలో అయినా సరే నింపాదితనానికి చోటేలేదు. బతకడానికి డబ్బులు కావాలంటే నిద్రలేచింది మెుదలు ఉరుకులు, పరుగులతో ఉద్యోగానికి పరుగెత్తుతుంటారు. 
 
అయితే ఇంత వేగవంతమైన జీవితంలో కూడా పడుకునే ముందు ఒకరకమైన ఆహార అలవాట్లు ఏర్పర్చుకుంటే హాయిగా నిద్రపోవచ్చని సమతుల ఆహార నిపుణుల సలహా. మనిషి నిద్రకు ఉపకరించే హార్మోన్స్ మన ప్రపంచంలో సహజంగా దొరికే ఐదు ఆహార పదార్థాల్లో పుష్కలంగా లభిస్తుంది. అవేంటో తెలుసుకుందాం.
 
అరటిపండులో కార్భోహైడ్రెట్స్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇవి మెదడులోని హార్మోన్స్‌ను ఉత్తేజపరుస్తాయి. అంతేకాకుండా తలత్రిప్పడాన్ని కూడా తగ్గిస్తుంది. ఈ అరటిపండులో మెగ్నిషియం, కండరాలకు విశ్రాంతి కలిగిస్తుంది. ఇలాచేయడం వలన సుఖంగా నిద్రపోవచ్చును. నిద్రకు ఉపకరించేముందు గ్లాసు వేడిపాలు త్రాగాలి. ఇవి మెదడుపై ఒత్తిడి పడకుండా చూస్తుందని శరీరంలోని క్యాల్షియం కొరత లేకుండా చేసేందుకు ఉపయోగపడుతుంది.
 
రాత్రివేళల్లో ఆకలిగా ఉంటే ఓట్స్‌ను ఆహార పదార్థాలను తీసుకుంటే సుఖంగా నిద్రపోవచ్చును. ఇక వేడి పాలలో తేనె కలుపుకుని తీసుకుంటే ఉదయం లేచిన తరువాత ఉల్లాసంగా ఉంటారు.