పల్లీలతో మేలెంత? గర్భిణీ మహిళలు తీసుకుంటే?

మంగళవారం, 26 సెప్టెంబరు 2017 (11:35 IST)

పల్లీలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచి గుండెకు మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పల్లీలు బరువును అదుపులో ఉంచడంలోనూ కీలకంగానే పనిచేస్తాయి. ఇందులోని పీచు, కొవ్వు, మాంసకృత్తులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పల్లీల్లో వుండే పోషకాలు.. పొట్ట నిండినట్లు అనిపిస్తాయి. అలా ఆకలిని తగ్గించి.. శరీరానికి అవసరమైన శక్తి అందిస్తుంది. ఇంకా బరువును కూడా తగ్గిస్తుంది.
 
అదేవిధంగా  పిల్లల ఎదుగుదలకు మాంసకృత్తులు చాలా అవసరం అవుతాయి. అవి పల్లీల నుంచి సమృద్ధిగా అందుతాయి. వాటిని తరచూ పెట్టడం వల్ల వాళ్ల మెదడు పనితీరు చురుగ్గా మారడమే కాదు.. ఎదుగుదలా బాగుంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వారంలో రెండుసార్లు పల్లీలు తినేవారిలో.. క్యాన్సర్‌ వచ్చే ఆస్కారం 27 నుంచి 58 శాతం వరకూ తగ్గినట్లు తాజా అధ్యయనంలో తేలింది. 
 
గర్భిణులకు పల్లీలు చేసే మేలు అంతాఇంతా కాదు. వీటిల్లో ఫోలేట్‌ కూడా ఉంటుంది. గర్భధారణకు ముందూ తరవాత ఈ ఫోలిక్‌ యాసిడ్‌ అందడం వల్ల.. పుట్టబోయే పాపాయిల్లో నాడీ సంబంధ సమస్యలు చాలామటుకూ తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. గర్భిణీ మహిళలు పల్లీలు తీసుకోవడం వల్ల పాపాయిలు పుట్టాక కూడా అలర్జీలూ, ఉబ్బసం వచ్చే ఆస్కారం చాలామటుకు తగ్గుతుందని వారు సూచిస్తున్నారు.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

అన్నం ఉడికేటప్పుడు ఈ ఒక్కటి కలిపితే షుగర్ జన్మలో రాదు..

అన్నం వండేటప్పుడు ఈ ఒక్కటి కలిపితే చాలు క్రొవ్వు, షుగర్ మన దరిదాపుల్లోకి కూడా రావు. ...

news

ముందు రోజు జంక్ ఫుడ్ తింటే.. నిమ్మరసం తాగండి..

ఒక గ్లాసు గోరు వెచ్చటి నీటిలో కొంచెం నిమ్మరసం కలుపుకుని తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు ...

news

పోర్న్‌ చూడటం వల్ల ఎటువంటి పరిణామాలు కలుగుతాయి?

హైటెక్ యుగంలో పెక్కు మంది చెడు అలవాట్లకు బానిస అవుతున్నారు. ఇలాంటి అలవాట్లలో పోర్న్ ...

news

60 వయస్సు వారు 20 వయస్సు వారిగా మారాలంటే...!

చాలామంది వయస్సయిపోతోందని బాధపడుతుంటారు. ఆరోగ్యం సహకరించక, ముఖమంతా ముడతలు పడిపోయి రకరకాల ...