శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 19 అక్టోబరు 2016 (15:09 IST)

పచ్చి పొటాటో జ్యూస్‌లో ఏముందో తెలుసా? కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తుందట..

పచ్చి పొటాటో జ్యూస్‌లో బోలెడు పోషకాలున్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఉడికించి తీసుకోవడం, ఫ్రై చేసి తీసుకోవడం కంటే పొటాటోలను పచ్చిగా జ్యూస్‌ల రూపంలో తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినవారమవుతాం.

పచ్చి పొటాటో జ్యూస్‌లో బోలెడు పోషకాలున్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఉడికించి తీసుకోవడం, ఫ్రై చేసి తీసుకోవడం కంటే పొటాటోలను పచ్చిగా జ్యూస్‌ల రూపంలో తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినవారమవుతాం. పొటాటోను జ్యూస్ రూపంలో తీసుకుంటే వివిధ రకాల గ్యాస్ట్రిక్ సమస్యలు, ఎసిడిటి, అల్సర్ వంటి అనేక సమస్యలను నివారిస్తుంది.
 
తాజా పచ్చిబంగాళాదుంప జ్యూస్‌లో క్యాన్సర్ సెల్స్‌తో పోరాడే లక్షణాలు పుష్కలంగా ఉన్నట్లు న్యూట్రీషన్లు అంటున్నారు. ఇది శరీరంలోని ఆర్గాన్స్ డ్యామేజ్‌ను, క్యాన్సర్ సెల్స్ కారణం అయ్యే ఫ్రీరాడికల్స్‌ను నివారిస్తుంది. అలాగే పొటాటో జ్యూస్ కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తుంది. తద్వారా గుండె సంబంధిత సమస్యలు గుండెపోటు అటాక్ వంటి సమస్యలను నివారిస్తుంది. ఫ్రెష్ బంగాళాదుంపల జ్యూస్‌‌ను రెగ్యులర్‌గా తీసుకుంటే కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గించుకోవచ్చునని న్యూట్రీషన్లు సూచిస్తున్నారు.