శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By kowsalya
Last Updated : మంగళవారం, 8 మే 2018 (13:26 IST)

బరువు తగ్గాలంటే రాగులను తీసుకుంటే? ఎలా? ఎందుకు?

వేసవిలో రాగులను ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఇందులో క్యాల్షియం పుష్కలంగా వుండటంతో ఎముకలకు బలం చేకూరుతుంది. రాగులలో మాంసకృత్తులు వుండటం వల్ల పోషాకాహారలోపం తలెత్తదు. వీటిని తీసు

వేసవిలో రాగులను ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఇందులో క్యాల్షియం పుష్కలంగా వుండటంతో ఎముకలకు బలం చేకూరుతుంది. రాగులలో మాంసకృత్తులు వుండటం వల్ల పోషాకాహారలోపం తలెత్తదు. వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుతాయి. ఇవి గుండెజబ్బుల్ని దూరం చేస్తుంది. కొలెస్ట్రాల్‌కు చెక్ పెడుతుంది.  
 
రాగులలో ఇనుము ఎక్కువ మోతాదులో ఉంటుంది. కాబట్టి దీనివల్లే రక్తహీనతతో బాధపడుతున్న వారికి వీటిని ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. మీ బరువు తగ్గాలనుకునే వారికి రాగులను డైట్‌లో చేర్చుకోవాలి. రాగులతో సంగటి లేదా అంబలి.. రాగి రొట్టెలు, దోసెల రూపంలో తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలు చేకూర్చుతారు. 
 
రాగి పిండిలో చాలా రకాలైన అమైనో ఆమ్లాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఇవి మానసిక ఒత్తిడికి గురైన వాళ్లకి, ఆందోళనను తగ్గించడంతో పాటు కండరాలకు బలాన్నిస్తాయి. రాగులలో విటమిన్స్ ఎక్కువగా ఉండడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.