Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సముద్ర ఆహారంతో గుండెపోటును అడ్డుకోవచ్చు....

శనివారం, 1 జులై 2017 (22:05 IST)

Widgets Magazine

గుండె ఆరోగ్యంగా వుండాలంటే సముద్రపు ఆహారం తీసుకోవాలని వైద్య నిపుణులు చెపుతున్నారు. ఈ ఆహారం తీసుకుంటే గుండెపోటును 50 శాతం వరకు తగ్గించవచ్చునని తాజా అధ్యయనంలో తేలింది. వారానికి ఒకసారి లేదా రెండుసార్లు సీ ఫుడ్‌ను ఆహారంగా తీసుకోవడం ద్వారా గుండె సంబంధిత రోగాలకు అడ్డుకోవచ్చునని లండన్ నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌హెచ్ఎస్) సూచిస్తున్నట్లు డెయిల్ మెయిల్ ప్రచురించింది. 
 
రొయ్యలు, పీతలు, స్క్విడ్, ఆక్టోపస్‌లలో విటమిన్స్, మినరల్స్ మెండుగా ఉన్నాయని ఎన్‌హెచ్ఎస్ తెలిపింది. సల్మోన్ అనే సముద్ర చేప నుంచి వచ్చే చేపనూనె గుండెపోటును నియంత్రిస్తుంది. సముద్రపు ఆహారంలో కీలక ఫ్యాటీ యాసిడ్ ఉందని ఇది.. గుండెను ఆరోగ్యవంతంగా ఉంచుతుందని ఎన్‌హెచ్ఎస్ తెలిపింది. 
 
సముద్రపు ఆహారంలో కొవ్వు శాతం ఇతర మాంసాహారంతో పాటు చీజ్, ఫాస్ట్‌ఫుడ్‌లకంటే తక్కువగా ఉంటుంది. ఇంకా రక్తంలోని కొవ్వు శాతాన్ని నియంత్రించడంలో సముద్రపు ఆహారం తీసుకోవడం ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే, గర్భధారణ సమయంలో ముడి షెల్ల్ఫిష్ మరియు రా సీ ఫుడ్‌ను తీసుకోకూడదని ఎన్‌హెచ్ఎస్ వ్యతిరేకిస్తోంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

వర్షాకాలంలో వేడినీళ్లు ఎందుకు తాగాలి?

వర్షాకాలం అనగానే జబ్బులు ఇబ్బంది పెడుతుంటాయి. అందుకే వర్షాకాలంలో గోరువెచ్చని నీళ్లు తాగడం ...

news

కరివేపాకు, వేపాకు ముద్దను మజ్జిగలో కలిపి తీసుకుంటే?

చర్మసమస్యలు వేధిస్తుంటే? లేత కరివేపాకు, వేపాకు ఆకులను ముద్దగా నూరి ఒక స్పూన్ ముద్దను ...

news

టిఫిన్ చేసిన వెంటనే కాఫీ, టీలు తాగడం చేస్తే?

టిఫిన్ లేదా భోజనం చేసిన వెంటనే కాఫీ, టీలు తాగే అలవాటున్నవారు మానుకోవాల్సిందే అంటున్నారు.. ...

news

ఒత్తిడి అధికమైతే.. రోజూ మధ్యాహ్న భోజనంలో ఒక కప్పు పెరుగు తీసుకోండి

పనిలో ఒత్తిడి అధికమైందా? ఆందోళన వేధిస్తుందా? అయితే వెంటనే ఓ కప్పు పెరుగును రోజువారీ ...

Widgets Magazine