శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 10 డిశెంబరు 2015 (17:39 IST)

చలికాలంలో వచ్చే చర్మవ్యాధుల పట్ల మరింత అప్రమత్తత అవసరం!

చలికాలంలో అనేక రకాలైన చర్మవ్యాధులు వస్తుంటాయి. ముఖ్యంగా, చర్మ పొడిబారిపోతోంది. అలాగే సుమారు 50 రకాల చర్మ సంబంధిత వ్యాధులు వస్తుంటాయి. ఇవి ఎలాంటి ప్రదేశంలో ఉన్నా రావచ్చు. ఇలాంటి చర్మవ్యాధుల బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశాన్ని పరిశీలిస్తే.. 
 
చర్మ వ్యాధులు కలిగినపుడు, స్వతహాగా చికిత్సలు చేసుకోవడం కంటే అందుబాటులో ఉన్న వైద్యుడిని సంప్రదించి... మందులు తీసుకోవడం ఉత్తమం. చాలా మందికి వివిధ రకాల చర్మ వ్యాధుల గురించి అవగాహన లేకపోవచ్చు. స్వతహాగా వైద్యాన్ని చేసుకోవటం వలన అవి ద్రుష్పభావాలను కలుగ చేయవచ్చు. అందువల్ల చర్మ వ్యాధుల పట్ల ఎల్లప్పుడూ జాగ్రత్త వహిస్తూ, నిపుణుల లేదా వైద్యుల సహాయాన్ని తీసుకోవటం మంచిది.
 
అలాగే, చాలా రకాల చర్మవ్యాధులకు సరైన మందులు అందుబాటులో లేవు. ఇలాంటి వ్యాధుల పట్ల మరింత అప్రమత్తంగా ఉంటూ వ్యాధి తీవ్రతను తగ్గించుకోవాలి. అదేవిధంగా చలికాలంలో ఔషద సబ్బులతో ముఖాన్ని వాష్ చేసుకోవడం ఎంతో ఉత్తమం. అలాగే, తక్కువగా మేకప్‌లను వాడండి. ఎక్కువ సమయం పాటూ చర్మాన్ని గాలి తగిలేలా జాగ్రత్త తీసుకోండి.