శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Kowsalya
Last Updated : బుధవారం, 4 జులై 2018 (11:50 IST)

సోయాబీన్ ఆరోగ్య విషయాలు....

సోయాబీన్‌ను పూర్ణ ఆహారంగా ఆరోగ్య నిపుణులు గుర్తించారు. పోషకాహార లోపంతో బాధపడుతున్నవారు సోయాబీన్ తీసుకుంటే మంచిది. జంతుమాంసం నుండి లభించే ప్రోటీన్లలో కొవ్వు అధికంగా ఉంటుంది. కాని సోయా నుండి లభించే ప్రో

సోయాబీన్‌ను పూర్ణ ఆహారంగా ఆరోగ్య నిపుణులు గుర్తించారు. పోషకాహార లోపంతో బాధపడుతున్నవారు సోయాబీన్ తీసుకుంటే మంచిది. జంతుమాంసం నుండి లభించే ప్రోటీన్లలో కొవ్వు అధికంగా ఉంటుంది. కాని సోయా నుండి లభించే ప్రోటీన్లలో తక్కువస్థాయిలో కొవ్వు ఉండడం వలన రక్తనాళాలకు తద్వారా గుండెకు ఎంతో మేలుచేస్తుంది.
 
సోయా ఉత్పత్తులు శరీరంలో పెద్దప్రేగు ఆరోగ్యానికి దోహదపడుతుంది. ముఖ్యంగా ఈ పేగులో వచ్చే క్యాన్సర్‌ను నివారించడానికి సోయా చాలా ఉపయోగపడుతుంది. జీర్ణవ్యవస్థ మెరుగుదలకు, అన్నవాహిక ఆరోగ్యానికి సోయాబీన్ చాలా సహాయపడుతుంది. సోయా ఉత్పత్తుల్లోని ఫైటోఈస్ర్టోజన్ క్యాల్షియాన్ని అధికం చేసి ఎముకలు దృఢంగా ఉండేందుకు తోడ్పడుతుంది.
 
సోయా సంబంధ ఆహారపదార్థాలు మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తాయి. మూత్రపిండ వ్యాధితో బాధపడేవారు సోయాబీన్ పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే ఫలితం ఉంటుంది. కిడ్నీల్లో రాళ్లలాంటి సమస్యలు తలెత్తకుండా కాపాడుతుంది.