తిన్న వెంటనే ఇది చేస్తున్నారా.. ఇక మీ పని అంతే..!

గురువారం, 29 జూన్ 2017 (12:03 IST)

మనం చేసే పనులలో బాగా ఇష్టపడి చేసే పని భోజనం చేయడం. మనం ఎంత కష్టపడినా సరైన భోజనం చేస్తే ఆకలి తీరినట్లే కదా. చాలామంది సరైన సమయాల్లో భోజనం చేస్తుంటారు కానీ భోజనం తర్వాత చేయకూడనివి కొన్నింటివి చేస్తుంటారు. కొంతమంది ఇలా చేయడం కారణంగా జీర్ణప్రక్రియ బాగా మందగిస్తుందని వైద్యులు చెబుతున్నారు. తిన్న వెంటనే స్నానం చేస్తే ఉదర సమస్యలు తలెత్తుతాయట. అందుకే భోజనం అయిన రెండు, మూడు గంటల తర్వాత స్నానం చేయాలట. 
 
తిన్న తర్వాత చాలా మంది స్మోకింగ్ చేస్తుంటారు.. కానీ ఇలా చేస్తే జీర్ణ క్రియ సరిగ్గా అవ్వదట. సిగరెట్‌లో ఉండే నికోటిన్ జీర్ణక్రియ ప్రక్రియను అడ్డుకోవడమే కాకుండా శ్వాస సమస్యలు తలెత్తుతాయి. తిన్న వెంటనే వాకింగ్ చెయ్యకుండా 20 నిమిషాల తర్వాత వాకింగ్ చేస్తే చాలా మంచిది. మరీ వేగంగా నడవకుండా నెమ్మదిగా నడవాలని వైద్యులు సూచిస్తున్నారు. భోజనం అయిన వెంటనే చాలామంది టీ, ఫ్రూట్స్ తీసుకుంటుంటారు.. ఇలా చేయడం కరెక్టు కాదట. 
 
భోజనం తర్వాత టీ, ఫ్రూట్స్ తీసుకుంటే శరీరం నుంచి ఐరన్‌లను కోల్పోవాల్సి వస్తుంది. భోజనం తర్వాత ఎక్సర్‌సైజ్‌గానీ, ఆశనాలుగానీ అస్సలు చేయకూడదు. ఒకవేళ చేస్తే శరీరం ఇకారంగా మారడమే కాకుండా కడుపునొప్పి, వాంతులవుతాయట. అలాగే తిన్న వెంటనే నిద్రకూడా పోకూడదట. తిన్న తర్వాత ఏదైనా చేయాలనిపిస్తే కాస్త నీళ్ళు తాగి మీ బంధువులతోనో, స్నేహితులతోనూ మాట్లాడుతూ కూర్చుంటే మంచిదట. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

అమృతం అంటే నిమ్మకాయ..!

ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం బాగుంటేనే ఏదైనా మనం చేయగలం. మన వంటింట్లో లభించే ఆహార ...

news

స్మార్ట్ ఫోన్లతో ఆలోచనా సామర్థ్యం తగ్గిపోతుందట..

ఉచిత డేటా పుణ్యంతో ట్యాబ్లు, స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్‌ల వినియోగం విపరీతంగా ...

news

వీర్యవృద్ధి - లైంగికశక్తి ఒకేసారి పెరగాలంటే...?

సాధారణంగా చాలామందిలో వీర్యకణాల ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. ఇలాంటి పురుషుల్లో సంతాన భాగ్యం ...

news

తమలపాకులు - పచ్చకర్పూరం నమిలి రసాన్ని మింగితే...

సాధారణంగా చాలా మందికి ఉదయం నిద్రలేవగానే కళ్లు బైర్లుకమ్మడం, తల తిరగడం, కడుపులో వికారంగా ...