శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chitra
Last Updated : శుక్రవారం, 5 ఫిబ్రవరి 2016 (10:24 IST)

చలికాలంలో జుట్టు రాలిపోతుందా.. నిద్రపోయే ముందు ఆలివ్ నూనె పట్టించండి!

చలికాలంలో చర్మం త్వరగా పాడైనట్లే జుట్టు కూడా త్వరగా పాడవుతుంది. ఈ కాలంలో జుట్టు రాలిపోవటం, చుండ్రు వంటి సమస్యలు అధికంగా వస్తుంటాయి. చలికాలంలో జుట్టును సంరక్షించుకోవటానికి ఆహారపదార్థాలతో చేసుకునే కొన్నిహెయిర్‌ మాస్క్‌ల గురించి తెలుసుకుందాం.
 
ఆలివ్‌ ఆయిల్‌ను రెండు నిమిషాల పాటు వేడి చేయాలి. గోరు వెచ్చని ఆలివ్‌ ఆయిల్‌ను జుట్టుకు బాగా పట్టించాలి. రాత్రి నిద్రపోయే ముందు ఆలివ్‌నూనెను పట్టించి ఉదయాన్నే స్నానం చేయాలి. ఇలా చేస్తే జుట్టు సమస్యలు తొలగిపోతుంది.
 
కప్పులో సరిపోయేంత తేనెను తీసుకుని అందులోకి కోడిగుడ్డు తెల్లసొనను వేసి మిశ్రమంగా కలపాలి. దాంతో జుట్టుకు అర్థ గంటపాటు మర్దనా చేసి శుభ్రంగా కడిగేస్తే చక్కని ఫలితం కనిపిస్తుంది.
 
అలొవిరా జెల్‌ను తీసుకుని అందులో నిమ్మరసం, ఆలివ్‌నూనె. కొబ్బరినూనెను ఒక టేబుల్‌ స్పూన్‌ వేసి కలపాలి. దీన్ని మిశ్రమంగా కలిపి జుట్టుకు కుదుళ్ల దాకా పట్టించి అరగంట తర్వాత శుభ్రపరిస్తే ఫలితం త్వరగా కనిపిస్తుంది.