టమోటా జ్యూస్‌కి చిటికెడు ఉప్పు లేదా పంచదార కలుపుకుని తాగితే?

శుక్రవారం, 7 సెప్టెంబరు 2018 (12:41 IST)

టమోటాలను మిక్సీలో వేసుకుని జ్యూస్‌లా చేసుకుని.. అందులో కాస్త ఉప్పు లేదా వేసుకుని రోజూ తీసుకుంటే చర్మం నిగారింపును సంతరించుకుంటుంది. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది. పండిన టమోటాను రోజుకు ఒకటి తీసుకోవడం ద్వారా సులభంగా బరువు తగ్గవచ్చు. 
 
టమోటా ద్వారా అందంతో పాటు ఆరోగ్యం పొందవచ్చు. టమోటాలో విటమిన్ ఎ,బి,సి పుష్కలంగా వున్నాయి. ఆహారాన్ని తీసుకునేందుకు అర గంట ముందు టమోటాను తీసుకోవడం ద్వారా బరువును నియంత్రించుకోవచ్చు. 
 
టమోటా గుజ్జులో పాలను కలిపి.. ఈ గుజ్జును ముఖానికి రాసుకుంటే.. ముఖం కాంతివంతంగా మారుతుంది. అలాగే టమోటా గుజ్జులో తేనె కలిపి ముఖానికి రాసుకుని 20 నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మం నిగారింపును సంతరించుకుంటుంది. 
 
టమోటాను సగానికి సగం కట్ చేసి.. ముఖంపై కొద్దిసేపు మృదువుగా రబ్ చేయాలి. 20 నిమిషాల తర్వాత ఆగి కడిగేస్తే చర్మంపై నున్న జిడ్డు తొలగిపోతుంది. చర్మం మృదువుగా తయారవుతుంది. టమోటా గుజ్జుకు రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం కలిపి ముఖానికి అప్లై చేసి పావు గంట తర్వాత కడిగేస్తే చర్మం తళతళ మెరిసిపోతుంది.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

వేపాకుల కషాయాన్ని తీసుకుంటే?

వేప ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉన్నాయి. ఇవి రక్తాన్ని శుభ్రం చేస్తాయి. ...

news

ప్రతిరోజూ తులసి ఆకుల రసాన్ని తీసుకుంటే?

తులసి ఆకులలో పోషకాలు, ఖనిజాలు, విటమిన్స్, పొటాషియం, ఐరన్ వంటివి పుష్కలంగా ఉన్నాయి. తులసి ...

news

నేతిలో వేయించిన జీలకర్ర చూర్ణంలో తగినంత ఉప్పు కలిపి...

మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందనేది మరిచిపోలేని వాస్తవం. మనం తీసుకునే ఆహారాన్ని బట్టేమన ...

news

ఆ చెట్టు వేర్లను, బెరడును నలగ్గొట్టి నీటిలో వేడిచేసి వడగట్టి పురుషులు తీసుకుంటే?

చిట్టాముట్టి వేరును నూరుకుని ఆ మిశ్రమంలో ఆవుపాలు, నువ్వుల నూనె కలుపుకుని బాగా ...