Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బిర్యానీ లాగిస్తున్నారా? నెయ్యి, వనస్పతి, డాల్డా, మసాలాలతో ఇబ్బందే!

ఆదివారం, 12 ఫిబ్రవరి 2017 (14:37 IST)

Widgets Magazine

షాపుల్లో బిర్యానీ లాగిస్తున్నారా? అయితే కాస్త వెనక్కి తగ్గండి. పుట్టిన రోజు వేడుకలైనా, పెళ్లి రిసెప్షన్ అయినా చికెన్ బిర్యానీ లేనిదే ముద్ద దిగదు. ఆల్కాహాల్ ప్రభావంతో వచ్చే కాలేయ సమస్యలు అతిగా చికెన్, మటన్ బిర్యానీలు లాగించేసినా వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. బిర్యానీతో పాటు తీసుకునే కూల్ డ్రింక్‌ల ప్రభావంతో ఈ కాలేయ సమస్యలు మరింత ఎక్కువవుతాయని వారు చెప్తున్నారు. 
 
బిర్యానీల్లో వనస్పతి, నెయ్యి, డాల్డా, మసాలా వంటి దినుసులను ఎక్కువగా వాడటం, కొన్ని రెస్టారెంట్లలో క్వాలిటీ లేని మాంసాన్ని ఉపయోగించడం వల్ల ఈ సమస్యలు వస్తుంటాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఒక్క బిర్యానీని తింటే సుమారు 500 కేలరీలు చేరతాయని, అంత భారీ మొత్తంలో కేలరీలు మనిషికి ఒకే సారి అవసరం లేదని తెలిపారు. 
 
మద్యం అలవాట్లు లేకున్నా ఆల్కహాల్ ప్రభావంతో వచ్చే కాలేయ సమస్యలతో బాధపడేవారి సంఖ్య ప్రతీ ఏడాది 30 నుంచి 35 శాతం పెరుగుతోందట. నగరాల్లో వీరి సంఖ్య మరీ ఎక్కువగా ఉందని పరిశోధనలో తేలింది.
 
వారం వారం క్రమం తప్పకుండా బిర్యానీని ఫుల్లుగా లాగించే సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు తేలింది. అకస్మాత్తుగా కడుపునొప్పి రావడం, ఛాతి నొప్పి, నీరసం వంటి లక్షణాలతో బాధితులు ఎక్కువగా ఆసుపత్రి మెట్లు ఎక్కుతున్నారని పరిశోధనలో వెల్లడైంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

షాపుల్లో పండ్ల రసాలను ఎంచక్కా లాగిస్తున్నారా? జ్యూసుల్లో వాడే ఐస్ ఎలా చేస్తారో తెలుసా?

తాజా పండ్ల రసాలు తాగితే ఆరోగ్యానికి మేలు చేకూరుతుందని ఆరోగ్య నిపుణులు. ఇక ఇంట్లో తాజా ...

news

కూరగాయలు.. పండ్లు తినండి.. ప్రశాంతంగా ఉండండి..

ఫాస్ట్ ఫుడ్‌, పిండివంటలు వద్దు.. కూరగాయలు, పండ్లే ముద్దు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇవి ...

news

పల్లీలు తినండి.. ఆలోచనాశక్తిని పెంచుకోండి.. గుండె జబ్బులకు బై చెప్పండి..

పల్లీలు తినండి.. ఆలోచనాశక్తిని పెంచుకోండి.. గుండె జబ్బులకు బై చెప్పండి అంటున్నారు ఆరోగ్య ...

news

బీపీ, కొలెస్ట్రాల్ తగ్గాలంటే.. గ్రీన్ ఆపిల్ తినండి

గ్రీన్ ఆపిల్‌లో పోషకాలు, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి జీర్ణ వ్యవస్థ లోపాల నుండి ...

Widgets Magazine