సోమవారం, 6 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Kowsalya
Last Updated : మంగళవారం, 19 జూన్ 2018 (20:49 IST)

వీడియోగేమ్స్ ఆడేవాళ్లకు... ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన విషయాలు...

వీడియోగేమ్స్ ఆడే అలవాటున్నవారిని ఆందోళనకు గురి చేసే విషయాలున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థలో తెలియజేసారు. వీడీయోగేమ్స్ కూడా కొకైన్, జూదంలాంటి వ్యసనాలేనని నిపుణులు ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా నిపుణులు సం

వీడియోగేమ్స్ ఆడే అలవాటున్నవారిని ఆందోళనకు గురి చేసే విషయాలున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థలో తెలియజేసారు. వీడీయోగేమ్స్ కూడా కొకైన్, జూదంలాంటి వ్యసనాలేనని నిపుణులు ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా నిపుణులు సంప్రదించిన ఆధారాలను కూలంకషంగా పరిశీలించిన తరువాతే ఈ పరిస్థితిని వ్యసనంగా నిర్ధారించినట్లు తెలిపారు.
 
ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో వీడియో గేమ్స్ ఆడడాన్ని వ్యసనంతో కూడిన ప్రవర్తనగా వర్గీకరించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్నది. నియంత్రణను కోల్పోవడం, ఆడకుండా ఉండలేకపోవడం వీటిన్నంటిని వదిలేసి చాలా మంది వీడియో గేమ్స్ పైనే దృష్టి పెట్టడం లాంటి లక్షణాలను కలిగియున్నారు. ఎక్కువ సేపు గేమ్స్ ఆడేవారికి ఇతర ఆసక్తులు, కార్యకలాపాలను ఈ గేమ్స్ నిర్లక్ష్యం చేస్తున్నాయి.
 
ఈ వీడియో గేమ్స్ ఆడుతూ నిద్ర, తిండి కూడా పట్టించుకోరని ప్రపంచ ఆరోగ్య సంస్థ మానసిక ఆరోగ్య విభాగంలో డైరెక్టర్ శేఖర్ సక్సేనా తెలియజేశారు. ఇలాంటి తీవ్రరూపం దాల్చిన కేసుల్లో గేమ్స్ అలవాటున్నవారు స్క్రీన్‌ను ఆఫ్ చేయలేరు. ఈ గేమ్స్ వలన స్కూళ్లకు వెళ్లకపోవడం, ఉద్యోగాలను కోల్పోవడం వంటి సమస్యలకు గురవుతారు.