శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 28 సెప్టెంబరు 2017 (17:33 IST)

స్వీట్స్‌తో ఎముకలకు చేటే.. కూల్ డ్రింక్స్ అస్సలు తాగొద్దు..

స్వీట్స్ తీసుకోవడం ద్వారా ఎముకల బలం తగ్గిపోతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎముకలు బలంగా వుండాలంటే.. అధికంగా మాంసాహారం.. ముఖ్యంగా రెడ్ మీట్ ఎక్కువగా తీసుకోకూడదు. అలాగే స్వీట్స్ నోటికి రుచిగా

స్వీట్స్ తీసుకోవడం ద్వారా ఎముకల బలం తగ్గిపోతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎముకలు బలంగా వుండాలంటే.. అధికంగా మాంసాహారం.. ముఖ్యంగా రెడ్ మీట్ ఎక్కువగా తీసుకోకూడదు. అలాగే స్వీట్స్ నోటికి రుచిగా వున్నాయి కదాని టేస్ట్ చేయకూడదు. కొందరికి కూల్ డ్రింక్స్‌ అంటే చాలా ఇష్టం.  కూల్ డ్రింక్స్‌లో యాడెడ్ షుగర్స్ విపరీతంగా ఉంటాయి. ఇవి బరువును పెంచుతాయి. అంతేగాకుండా ఎముకలకే మేలు చేయవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
అలాగే డార్క్ చాక్లెట్‌లో ఎముకలకి పనికొచ్చే లక్షణాలుండవు. ఇంకా ఎముకలని బలహీనపరిచే షుగర్స్, ఆక్సలేట్ కూడా ఉంటాయి. అందుకే చాక్లెట్లను ఎక్కువగా తీసుకోకూడదు. ఆల్కహాల్ లిమిట్ లేకుండా తీసుకుంటే ఎముకలకు దెబ్బే. కాఫీని ఎక్కువ తాగితే అందులో కెఫీని క్యాల్షియం స్థాయుల్ని తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.