శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By ivr
Last Modified: శనివారం, 9 డిశెంబరు 2017 (16:46 IST)

fatgirlfedup... బండ నుంచి బక్కపలచగా... ఏకంగా 180 కేజీలు తగ్గారు(ఫోటోలు)

fatgirlfedup, ఈ పదానికి ఇప్పుడు ఇన్‌స్టాగ్రాంలో 4.77 లక్షల మంది ఫాలోయర్లు. ఎందుకో తెలుసా? సుమారు 200 కేజీల బరువున్న ఓ మహిళే. ఆమె ఏం చేసింది తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే. లెక్సీ, డానీ ఇద్దరూ భార్యాభర్తలు. ఐతే పెళ్లి చేసుకునే సమయానికే ఇద్దరూ అధిక

fatgirlfedup, ఈ పదానికి ఇప్పుడు ఇన్‌స్టాగ్రాంలో 4.77 లక్షల మంది ఫాలోయర్లు. ఎందుకో తెలుసా? సుమారు 200 కేజీల బరువున్న ఓ మహిళే. ఆమె ఏం చేసింది తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే. లెక్సీ, డానీ ఇద్దరూ భార్యాభర్తలు. ఐతే పెళ్లి చేసుకునే సమయానికే ఇద్దరూ అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. 

ముఖ్యంగా లెక్సీ స్థూలకాయంతో వికారంగా వుండేది. అంతా గేలి చేసేవారు. ఐతే 2015వ సంవత్సరంలో ఓ కఠిన నిర్ణయం తీసుకుంది ఆ జంట. ఓ పద్ధతి ప్రకారం ఆహారాన్ని తీసుకుంటే క్రమంతప్పకుండా వ్యాయామం చేయాలని నిశ్చయించుకుంది. రోజులు గడుస్తున్నాయి. 
మొదట్లో పెద్దగా మార్పు లేకపోయినా క్రమంగా ఎక్కడో మెల్లమెల్లగా తేడా వస్తున్నట్లు గమనించింది. పట్టువదలని విక్రమార్కుల్లా ఇద్దరూ వ్యాయామాన్ని చేస్తూ, నాన్ వెజ్ వదిలేసి శాకాహారాన్ని మాత్రమే తీసుకుంటూ వెళ్లారు. అంతేకాదు.. తాము మొదట్లో ఎలా లావుగా వున్నామో ఆ ఫోటోలను పోస్టు చేశారు ఇన్‌స్టాగ్రాంలో. 
 
ఇక అక్కడ్నించి వ్యాయామం చేస్తూ బరువు తగ్గించుకుంటూ తమ శరీర ఆకృతుల్లో వస్తున్న తేడాలను పోస్టు చేస్తూ వచ్చారు. అలా 2015లో మొదలైన వారి పోస్టుంగులు ఇప్పటివరకూ సాగుతూనే వున్నాయి. fatgirlfedup అంటూ ట్యాగ్ లైన్‌తో వారు పోస్ట్ చేసిన ఫోటోలను, తీసుకున్న ఆహారాన్ని చూసేందుకు ఎంతోమంది ఆసక్తి చూపించారు. చూపిస్తూనే వున్నారు. 
 
ఆ జంటకు ఇప్పుడు ఏకంగా నాలుగున్నర లక్షల మందికి పైగా ఫాలోయర్లుగా మారిపోయారు. లావు అనేది ఓ సమస్య కానే కాదనీ, క్రమబద్ధమైన ఆహారాన్ని తీసుకుంటే వ్యాయామం చేస్తుంటే నాజూకుగా కనబడతారనేందుకు ఈ జంటే నిదర్శనం.