కడుపులో గ్యాస్... అబ్బ, తగ్గే మార్గమేంటి?

acidity
సిహెచ్| Last Modified గురువారం, 10 జనవరి 2019 (22:29 IST)
ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా ఎసిడిటీ సమస్య ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతుంది. ఆ సమస్య కారణంగా కడుపు ఉబ్బరం, చాతీలో మంట, కడుపునొప్పి లాంటి అనేక రకములైన ఆరోగ్య సమస్యలు తలెత్తున్నాయి. దీనికి మందులు వాడినా ఉపశమనం కలుగుతుంది కానీ... పూర్తిగా నయం అవ్వదు. అంతేకాకుండా మందులు ఎక్కువగా వాడడం వల్ల వేరే రకములైన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాకాకుండా మన ఇంట్లో ఉన్న పదార్దాలతోనే గ్యాసు సమస్యని తగ్గించుకోవచ్చు. అదెలాగో చూద్దాం.

1. గ్యాస్ సమస్య ఉన్నవారు ముఖ్యంగా హోటల్స్‌లో నూనెతో చేసిన పదార్థాలను పూర్తిగా వదిలేయాలి. మసాలాలు తగ్గించి తీసుకోవాలి. ఉదయాన్నే పరగడుపున రాగి పాత్రలో నీటిని లీటరుకు తగ్గకుండా తీసుకోవాలి.

2. ఒక స్పూన్ నిమ్మరసం, ఒక స్పూన్ పుదీనా రసం,మరియు ఒక స్పూన్ అల్లం రసం తీసుకుని దీనికి కొద్దిగా ఉప్పు కలిపి తీసుకున్నట్లయితే కడుపునొప్పి సమస్యను నివారించుకోవచ్చు.

3. ఇంగువ, యాలుకలు, శొంఠి, సైంధవ లవణం సమానంగా తీసుకుని మెత్తగా పొడిలాగా చేసుకుని ఉదయం సాయంత్రం అరస్పూన్ చొప్పున తీసుకుంటే ఆహారం సులభంగా జీర్ణమవడంతో పాటు కడపులోని గ్యాసు, కడుపు ఉబ్బరం తగ్గి శరీరం తేలికగా ఉంటుంది.

4. కడుపులో ఏర్పడే నొప్పిని తగ్గించడంలో బేకింగ్ సోడా అద్బుతంగా పని చేస్తుంది. బేకింగ్ సోడా ఆంటాసిడ్ గుణాలను కలిగి ఉంది. ఒక స్పూన్ బేకింగ్ సోడాను ఒక కప్పు వేడినీటిలో కలుపుకుని తాగడం వలన ఉదర భాగంలో ఏర్పడే నొప్పి త్వరగా తగ్గిపోతుంది.

5. బొప్పాయిని చిన్నచిన్న ముక్కలుగా తరిగి ఎండబెట్టి మెత్తటి పొడిలా చేసి రోజూ అరస్పూన్ పొడిని తగినంత తేనె కలిపి తీసుకుంటే కడుపునొప్పి, మలబద్దకం, అజీర్తి, వికారం, ఆకలి లేకపోవడం లాంటి ఉదర సంబంధిత వికారాలు తగ్గిపోతాయి.

6. ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా దాల్చిన చెక్క పొడిని వేసి బాగా మరిగించాలి. ఈ నీటిని చల్లార్చి తీసుకున్నట్లయితే కడుపునొప్పి సమస్యనుతగ్గించుకోవచ్చు.

7. అలాగే పంచదార మరియు జీలకర్రను నమిలి తిన్నా మంచి ఫలితం ఉంటుంది. తులసీ మరియు పుదీనా ఆకులను కలిపి నమిలినట్లయితే ఉదర సంబంధిత వ్యాధులు తగ్గుముఖం పడతాయి. వీటితో పాటు చల్లటి మజ్జిగలో కొద్దిగా జీలకర్ర పొడిని వేసి తీసుకున్నట్లయితే కడుపు ఉబ్బరం మరియు నొప్పి తగ్గుముఖం పడతాయి.దీనిపై మరింత చదవండి :