గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By pnr
Last Updated : సోమవారం, 20 ఆగస్టు 2018 (14:12 IST)

భోజనం చేశాక ఇలా చేయొద్దు...

చాలా మంది భోజనం చేశాక టీలు సేవించడం, పండ్లు పుష్టిగా ఆరగించడం, స్నానం చేయడం వంటివి చేస్తుంటారు. నిజానికి భోజనం చేసిన తర్వాత ఓ గంట పాటు ఎలాంటి ఆహారం లేదా చిరు తిండ్లను తీసుకోరాదు. అలా చేయడం ఆరోగ్యానికి

చాలా మంది భోజనం చేశాక టీలు సేవించడం, పండ్లు పుష్టిగా ఆరగించడం, స్నానం చేయడం వంటివి చేస్తుంటారు. నిజానికి భోజనం చేసిన తర్వాత ఓ గంట పాటు ఎలాంటి ఆహారం లేదా చిరు తిండ్లను తీసుకోరాదు. అలా చేయడం ఆరోగ్యానికి హానికరం అని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భోజనం తర్వాత ఏమేమి చేయకూడదో ఓ సారి తెలుసుకుందాం.
 
* చాలా మంది భోజనం చేసిన వెంటనే నిద్రపోయేందుకు పడకెక్కుతారు. నిజానికి తినగానే వెంటనే పక్కమీదకు చేరొద్దు. అలా నిద్రలోకి జారుకుంటే తిన్న ఆహారం జీర్ణమవ్వక ఇబ్బందులు తలెత్తుతాయి. 
 
* కొందరికి భోజనం చేయగానే స్నానం చేసే అలవాటు ఉంటుంది. ఇలా చేయడం వల్ల కాళ్లు, చేతుల్లోకి రక్త ప్రసరణ పెరుగుతుంది. దీనివల్ల పొట్ట చుట్టూ రక్తప్రసరణ తగ్గి జీర్ణవ్యవస్థ పనితీరు మందగించే ప్రమాదం ఉంది.
 
* భోజనం చేసేముందు కానీ, చేశాక కానీ వివిధ రకాల పండ్లు ఆరగించరాదు. ఇలా చేయడం వల్ల పొట్ట పెరుగుతుంది. రెండింటికీ మధ్య రెండు మూడు గంటల వ్యవధి ఉండాలి.
 
* అన్నం తిన్న తర్వాత టీ తాగితే భోజనం జీర్ణంకాదు. తేయాకులో ఉండే ఆమ్లాలు ఆహారంలో ఉండే మాంసకృత్తులను శరీరం వినియోగించుకోకుండా అడ్డుకుంటాయి.