గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By selvi
Last Updated : మంగళవారం, 5 డిశెంబరు 2017 (10:21 IST)

అల్లం రసంతో బరువు తగ్గండి..

పరగడుపునే అల్లం రసం తాగితే రక్త సరఫరా మెరుగు పడుతుంది. రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. గుండె పనితీరు మెరుగవుతుంది. గుండె సమస్యలు రావు. శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ ప

పరగడుపునే అల్లం రసం తాగితే రక్త సరఫరా మెరుగు పడుతుంది. రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. గుండె పనితీరు మెరుగవుతుంది. గుండె సమస్యలు రావు. శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు.
 
అల్లం రసంలో ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా వున్నాయి. అల్లం రసాన్ని రెండు స్పూన్లు వేడి నీటిలో కలుపుకుని తాగితే బరువు తగ్గుతారు. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తొలగిపోయి.. మంచి కొలెస్ట్రాల్ చేరుతుంది. కీళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి. శరీరానికి కావల్సిన జింక్, మెగ్నిషియం, పొటాషియంలు అల్లంలో సమృద్ధిగా ఉంటాయి. ఇవి నొప్పులను తగ్గిస్తాయి. గ్యాస్, అసిడిటీ పోతాయి. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. టాక్సిన్లు తొలగిపోతాయి.
 
శరీరంలో అధికంగా చేరే నీటిని తొలగిస్తుంది. పరగడుపునే అల్లం రసం తాగితే ఒంట్లో అధికంగా ఉన్న నీరు బయటికి వెళ్లిపోతుంది. అలసట, నీరసం తొలగిపోతాయి. ఇన్ఫెక్షన్లు, దగ్గు, జలుబు, ఫ్లూ తగ్గిపోతాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అల్లంలో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ వృద్ధాప్య ఛాయలను దరిచేరనీయవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.