ప్రయాణాల్లో వాంతులా... ఇలా చేస్తే సరి...

బస్సుల్లోగానీ, రైళ్లల్లోగానీ ప్రయాణిస్తున్న వేళల్లో కొందరికి తలనొప్పి, తల తిరగడం, వికారంతో పాటు విపరీతంగా వాంతులు అవుతుంటాయి. ఈ స్థితికి ఇతర కారణాలు కూడా ఉన్నా, దీర్ఘకాలికమైన మలబద్ధకం కూడా ఒక కారణమే. ఇలాంటి వారు ఆహారంలో పండ్లు, పీచు పదార్ధాల మోతాదును

Elachi
chj| Last Modified మంగళవారం, 13 మార్చి 2018 (21:52 IST)
బస్సుల్లోగానీ, రైళ్లల్లోగానీ ప్రయాణిస్తున్న వేళల్లో కొందరికి తలనొప్పి, తల తిరగడం, వికారంతో పాటు విపరీతంగా వాంతులు అవుతుంటాయి. ఈ స్థితికి ఇతర కారణాలు కూడా ఉన్నా, దీర్ఘకాలికమైన మలబద్ధకం కూడా ఒక కారణమే. ఇలాంటి వారు ఆహారంలో పండ్లు, పీచు పదార్ధాల మోతాదును పెంచడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. లేదంటే వారానికి ఒకసారి త్రిఫళా చూర్ణం వేసుకోవడం ద్వారా మలబద్ధకం నుంచి వాంతుల సమస్యనుంచి బయటపడవచ్చు.

ఇకపోతే గృహ ఔషధంగా ...
1. ప్రయాణ సమయంలో యాలకులు, లవంగాలు, జీలకర్ర వీటిల్లో ఏదో ఒకటి నోటిలో వేసుకొని కొంచెం కొంచెంగా నమిలి ఆ రసాన్ని మింగుతూ ఉండాలి.

2. ఉసిరికాయను నోటిలో ఉంచుకుని కొంచెం కొరికి ఆ రసాన్ని నిదానంగా మింగుతూ ఉండాలి. లేదా కొంచెం చింతపండును చప్పరిస్తూ ఆ రసాన్ని మింగుతూ ఉంటే ప్రయాణం తాలూకు వికారం, వాంతుల బాధ ఉండదు.

3. ఒకవేళ ఇవీ పని చేయకపోతే, ఆయుర్వేద షాపుల్లో దొరికే జంబీరాదిపానకం, పైత్యాంతకం లేదా మాతులుంగ రసాయనం వీటిల్లో ఏదో ఒకటి తీసుకుంటే ఈ వికారం, వాంతుల సమస్యల నుంచి దూరం కావచ్చు.


దీనిపై మరింత చదవండి :