మసాలా దినుసుల ఆరోగ్య విషయాలు...

మంగళవారం, 12 జూన్ 2018 (10:14 IST)

మసాలా దినుసులు, వనమూలికలు మనిషి ఆరోగ్యానికి ప్రథమ చికిత్సలా తోడ్పుడుతాయి. ఇందులో నిత్యం మన వంటల్లో ఉపయోగించే మసాలా దినుసులు ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి. వాటిలో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
 
అల్లం తీసుకుంటే అజీర్తితో బాధపడుతున్న వారికి ఉపశమనం కలిగిస్తుంది. ఉదరంలో గ్యాస్ ఏర్పడితే అల్లం మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. దగ్గు, జలుబు, కఫం మెుదలైన వాటికి అల్లం అమృతంలా పనిచేస్తుంది. ఉబ్బసపు వ్యాధితో బాధపడేవారు కాస్త అల్లం రసంలో తేనెను కలుపుకుని తీసుకుంటే ఉబ్బసం నుంచి విముక్తి చెందవచ్చును.
 
మెంతులు తీసుకుంటే మధుమేహ రోగులకు ఆయుర్వేదంగా పనిచేస్తుంది. ప్రతిరోజు మెంతులు తీసుకోవడం వలన రక్తం పలుచగా తయారవుతుంది. నిత్యం పరకడుపున మెంతుల చూర్ణం లేదా మెంతులు నీళ్ళలో కలిపి తీసుకుంటే మెుకాళ్ళ నొప్పుల నుండి బయటపడవచ్చును.
 
పసుపు తీసుకుండే శరీరానికి కావలసిన వేడి, రక్తశుద్ధి, కఫం, వాత, పిత్త రోగాలను నయం చేసే గుణం కలిగిఉంటుంది. జలుబు, పొడిదగ్గు సమస్యలు తెలెత్తినప్పుడు పసుపును వేడి నీటిలో లేదా పాలలో కలుపుకుని త్రాగితే మంచిది. దీంతో గొంతులో, ఊపిరితిత్తుల్లో ఉన్న కఫం బయటకువచ్చేస్తుంది. పసుపు వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుటలో దివ్యౌషధం.
 
సోంపు శరీరానికి చలవనిస్తుంది. ప్రతిరోజు భోజనానంతరం చాలామంది సోంపును వాడుతుంటారు. ఇది నోరు శుభ్రంగా ఉండేందుకు ఉపయోగపడుతుంది. జీలకర్ర జీర్ణక్రియను సాఫీగా ఉంచుటలో సహాయపడుతుంది. కడుపు ఉబ్బరంగా ఉండడం వంటి వాటిని నివారిస్తుంది. తులసిలో శరీరాన్ని చల్లబరిచే గుణముంది. వాయు సంబంధిత జబ్బుతో బాధపడేవారు దీనిని తీసుకోవడం వలన ఉపశమనం పొందవచ్చును. ధనియాలు కళ్ళ కాంతిని పెంచేందుకు సహాయపడుతుంది.దీనిపై మరింత చదవండి :  
ప్రకృతి ఆరోగ్యం మసాలా దినుసులు పసుపు అల్లం మెంతులు జిలకర సోంపు ఉసిరికాయ తులసి Nature Health Turmaric Ginger Tulasi Spicy Items

Loading comments ...

ఆరోగ్యం

news

అల్లం రసంలో ఉడికించిన కోడిగుడ్డు, తేనె కలిపి తీసుకుంటే..?

అల్లం రసాన్ని ఓ స్పూన్ తీసుకుని.. అందులో సగం ఉడికించిన కోడిగుడ్డు, కొద్దిగా తేనె కలిపి ...

news

యోగాసనాలు చేయడం వలన సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందా?

ఆరోగ్యం అంటే అందరూ శరీరానికి సంబంధించినదని అనుకుంటారు. కానీ నిజమైన ఆరోగ్యానికి మూలాలు ...

news

వక్షోజాల అందం కోసం క్యాబేజీ ఆకులు..

వక్షోజాలు అందవిహీనంగా మారిపోతే.. క్యాబేజీ ఆకులను వాడాలి. ఎలాగంటే..? క్యాబేజీ ఆకులను ...

news

రాత్రిపూట పెరుగు తీసుకోవాలనుకుంటే.. తేనే, మిరియాల పొడిని?

అలసిపోయిన శరీరానికి తక్షణ ఉపశమనం పొందాలంటే, ఒక స్పూన్ పంచదారలో రెండు స్పూన్ల పంచదారను ...