మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By
Last Updated : సోమవారం, 12 నవంబరు 2018 (16:23 IST)

ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ ఆరు పదార్థాలు తీసుకోవాల్సిందే..?

ఆరోగ్యంగా ఉండాలంటే రోజువారి ఆహారంలో ఈ ఆరు ఫుడ్స్ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వాటిలో మొదటిది ఆపిల్. రెండోది బాదం, మూడోది నిమ్మ, డార్క్ చాక్లెట్, సోయా బీన్, వెల్లుల్లి మొదలగునవి.

ఆపిల్ రోజూ తీసుకునే 34వేల మంది మహిళల్లో గుండెపోటు సమస్యలు తలెత్తలేదని తేలింది. ఆపిల్ శరీరంలోని ఎల్‌డిఎల్ అనే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. తద్వారా ఆయుష్షు పెరగడంతో పాటు హృద్రోగ, అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు.  
 
బాదం పప్పులోని విటమిన్ ఇ, గుడ్ ఫ్యాట్‌‍ను కలిగివుండే బాదంను రోజూ రెండేసి తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. ఇందులో ఐరన్, క్యాల్షియం, మాగ్నీషియం, పీచు పదార్థాలు అధికంగా ఉన్నాయి. రోజుకు మూడు బాదం పప్పుల్ని తీసుకుంటే శరీరంలో గుడ్ ఫ్యాట్ లెవల్స్ సక్రమంగా ఉంటాయి.  
 
రోజూ ఓ గ్లాసు నిమ్మరసం తాగడం మంచిది. ఇది శరీరానికి కావలసిన విటమిన్ సిని అందిస్తుంది. అంతేకాకుండా మంచి కొవ్వు హెచ్‌డిఎల్ స్థాయిని పెంచుతుంది. నిమ్మరసం ఎముకల్ని దృఢంగా చేస్తుంది. ఇందులో సిట్రస్ క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది.  
 
రోజూ వంటల్లో ఉపయోగించే వెల్లుల్లిపాయ.. వ్యాధి నిరోధక శక్తిని పెంచడంతో పాటు క్యాన్సర్ కణాల పెరుగుదలకు బ్రేక్ వేస్తుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండెను పదిలం చేస్తుంది. ఇందులోని అలిసిన్ హైబీపీని కంట్రోల్ చేస్తుంది. 
 
డార్క్ చాక్లెట్ తీసుకుంటే.. హైబీపీని కంట్రోల్ చేయవచ్చు. వారానికి రెండు లేదా మూడు చాక్లెట్లు తీసుకోవడం ద్వారా రక్తప్రసరణ సక్రమంగా ఉంటుంది. రక్తహీనతకు చెక్ పెడుతుంది. టైప్-2 డయాబెటిస్‌ను నియంత్రిస్తుంది. 
 
రోజూ అరకప్పు సోయాబీన్ తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు. నీరసం, అలసటకు చెక్ పెట్టాలంటే.. తప్పకుండా అరకప్పు సోయాబీన్ ఆహారంగా తీసుకోవాల్సిందే.