గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 7 నవంబరు 2017 (17:00 IST)

ఆ సముద్రంపై తేలియాడిన 26మంది అమ్మాయిల మృతదేహాలు?

మధ్యదరా సముద్రంలో రెక్కీ నిర్వహిస్తుండగా 26మంది అమ్మాయిల మృతదేహాలను ఇటలీ అధికారులు గుర్తించారు. 14 నుంచి 18ఏళ్ల మధ్య గల టీనేజర్లైన అమ్మాయిల మృతదేహాలు సముద్రంపై తేలుతూ కనిపించడంతో అధికారులు షాక్ అయ్యార

మధ్యదరా సముద్రంలో రెక్కీ నిర్వహిస్తుండగా 26మంది అమ్మాయిల మృతదేహాలను ఇటలీ అధికారులు గుర్తించారు. 14 నుంచి 18ఏళ్ల మధ్య గల టీనేజర్లైన అమ్మాయిల మృతదేహాలు సముద్రంపై తేలుతూ కనిపించడంతో అధికారులు షాక్ అయ్యారు. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు సహాయక సిబ్బంది సాయంతో గాలించి మృతదేహాలను వెలికితీశారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. 
 
నైజర్, నైజీరియా దేశాలకు చెందిన వలసదారులుగా సముద్రంలో తేలియాడిన టీనేజర్లు వుండొచ్చునని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. లిబియా నుంచి ఓడలో యూరప్‌ వెళ్తుండగా ప్రమాదం జరిగి సముద్రంలో మునిగిపోయి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 
 
ఇకపోతే.. లుబియాలో అమ్మాయిల అక్రమ రవాణా ఎక్కువగా ఉంటుంది. వివిధ దేశాల నుంచి ఇక్కడకు అమ్మాయిలను తీసుకొచ్చి వారిని లైంగికంగా వేధిస్తుంటారు. ఇటీవలి కాలంలో చాలా మంది అమ్మాయిలను సహాయ సిబ్బంది రక్షించారు. ఈ నరకం నుంచి తప్పించుకునేందుకు కొందరు అమ్మాయిలు ఇలా ప్రమాదకరంగా సముద్రాన్ని దాటే ప్రయత్నం చేసి ప్రాణాలు కోల్పోయివుంటారని స్థానిక అధికారులు అంటున్నారు.