మహిళ అకౌంట్ లోకి రూ.125 కోట్లు.. ఏం చేసిందంటే...

సోమవారం, 13 నవంబరు 2017 (16:44 IST)

cash notes

చేతిలో చిల్లిగవ్వ లేకప్పుడు ఎవరైనా అప్పు ఇస్తే బాగుండు అనుకుంటాం. అలా జరుగకుండా మన బ్యాంక్ అకౌంట్‌లో కొన్ని కోట్ల రూపాయలు అప్పనంగా వచ్చి పడితే ఎంత బాగుంటుంది కదా. అప్పుడు మనం సాధారణ మనిషిలాగా ఆలోచించం. నిజానికి అలా ఎందుకు జరుగుతుంది చెప్పండి. బ్యాంకులు ముక్కుపిండి మరీ ఛార్జీలను వసూలు చేస్తాయి. కానీ అంత మొత్తంలో పొరపాటున డబ్బును అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేస్తాయా అంటే ఒక్కోసారి నిజం కావచ్చు. అలాంటిదే ఒక యువతికి జరిగింది.
 
ఆస్ట్రేలియాకు చెందిన క్లేక్ వేన్ వైట్ అనే మహిళకి నేషనల్ ఆస్ట్రేలియా బ్యాంక్‌లో అకౌంట్ ఉంది. ఆమె ఒక న్యాయవాది. కష్టాల్లో ఉన్న సమయంలో ఆమెకు 25 మిలియన్ డాలర్లు ఒక్కసారిగా అకౌంట్‌లో పడ్డాయి. అది కూడా బ్యాంకు అధికారులే స్వయంగా ఆ డబ్బులను ట్రాన్ఫర్ చేశారు. తనకు పడిన మొత్తాన్ని చూసి ఆశ్చర్చపోయారు. వెంటనే తన మినీ స్టేట్‌మెంట్‌ను ఫోటో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఇది అలా అలా బ్యాంకు వరకు వెళ్ళింది. 
 
క్లేక్ వెన్ వైట్‌కు లోన్ కింద 2,500 డాలర్లను మాత్రమే చెల్లించాలి. బ్యాంకు సిబ్బంది తప్పిదం వల్ల 2,500కు బదులు 25 మిలియన్ డాలర్లను ట్రాన్ఫర్ చేశారు. అయితే ఆమె మాత్రం నిజాయితీగా వ్యవహరించారు.  బ్యాంకు సిబ్బందినే తన అకౌంట్ నుంచే డబ్బులు తీసేసుకోమని లెటర్ రాసిచ్చారు.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఫిలిప్పీన్స్‌లో పారతో మట్టిని తీసి రామాయణాన్ని తిలకించిన మోడీ...

ఫిలిప్పీన్స్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బిజీగా ఉన్నారు. లాస్ బానోస్ నగరంలో ఇంటర్నేషనల్ ...

news

షాకింగ్... శశికళ ఆస్తుల తనిఖీ కోసం ఐటీ 160 కార్లు, వాటి అద్దె ఎంతో తెలుసా?

జయలలిత నెచ్చెలి, జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళ ఆస్తులు తవ్వేకొద్దీ కోట్లలో తేలుతున్నట్లు ...

news

ప్రియుడి మృతి.. అతడి వారసుడిని కనాలనుకుంది.. సోషల్ మీడియాలో వైరల్

రోడ్డు ప్రమాదంలో ప్రియుడు ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఆ ప్రేయసి అతనిని మరిచి.. కొత్త ...

news

ట్రిపుల్ రైడింగ్ చేస్తే ట్రిపుల్ ఫైన్ చెల్లించాల్సిందే.. ఎక్కడ?

కొన్ని సందర్భాల్లో ద్విచక్రవాహనాల్లో ముగ్గురేసి ప్రయాణిస్తుంటారు. ఇలా ట్రిపుల్ రైడింగ్‌లో ...