Widgets Magazine

మహిళలు ఆఫీసుల్లో తినకూడని పదార్థాలు (video)

శుక్రవారం, 10 నవంబరు 2017 (10:26 IST)

పురుషులకు సమానంగా మహిళలు అన్నీ రంగాల్లో రాణిస్తున్నారు. అయితే గృహిణిగానూ, వర్కింగ్ ఉమెన్‌గా ఇరు పడవల్లో ప్రయాణం చేసే మహిళలు.. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవట్లేదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. తద్వారా ఒబిసిటీ వంటి ఇతరత్రా అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. పురుషులతో ధీటుగా అన్నీ రంగాల్లో రాణించే మహిళలు ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ తీసుకుంటేనే ఆయుష్షును పెంపొందించుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
అందుకే పోషకాహారం తీసుకోవాలని.. స్నాక్స్‌గా ఏవి పడితే అవి తినకూడదని వైద్యులు సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా ఉద్యోగం చేసే మహిళలు వర్కుప్లేసులో రకరకాల స్నాక్స్‌ తింటుంటారు. ఫలితంగా వారిలో కాలరీలు బాగా పెరుగుతాయి. అందుకే ఆఫీసులో పనిచేసేటప్పుడు మధ్య మధ్యలో చాలామంది ఆడవాళ్లు బిస్కెట్లు తింటుంటారు. బిస్కెట్లు ఒకటి రెండు పర్లేదు కానీ ఎక్కువగా తీసుకోవడం శరీరానికి మంచిది కాదు. బిస్కెట్లను వెజ్ ఆయిల్, పంచదార, మైదాపిండితో తయారు చేస్తారు. వీటిని తినడం ద్వారా శరీరంలో కేలరీలు పెరిగిపోతాయి. తద్వారా బరువు పెరుగుతారు.  
 
అలాగే కార్యాలయాల్లో మిల్క్ కాఫీకి కూడా దూరంగా ఉండాలి. ఇది ఒక కప్పు తాగినా శరీరంలో కేలరీలు బాగా పెరుగుతాయి. బ్లాక్ టీ, లెమన్ టీ తీసుకోవచ్చు. కొందరు కేక్స్‌ బాగా తింటుంటారు. వీటిని వారంలో ఓ నాలుగైదు సార్లు తింటే చాలు బరువు బాగా పెరిగిపోతారు. అందుకే తాజా కూరగాయల సలాడ్స్, ఫ్రూట్స్, తృణధాన్యాలను స్నాక్స్‌గా తీసుకోవడం ద్వారా మహిళలు ఆరోగ్యంగా వుంటారని ఆరోగ్య నిపుణులు సెలవిస్తున్నారు.

 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

మహిళ

news

ఇలా చేస్తే మహిళలకు వృద్ధాప్య ఛాయలు త్వరగా రావు...

శృంగారం అనే పదాన్ని ముఖ్యంగా భారతీయ సమాజంలో ఇప్పటికీ పెద్ద బూతుగానే భావిస్తారనడంలో ...

news

పెట్రోలియం జెల్లీతో సౌందర్యం..

శీతాకాలం వచ్చేస్తోంది. పెట్రోలియం జెల్లీకి కాస్త పంచదార కలిపి ముఖానికి రాసుకుని.. ...

news

పెళ్లికి ముందే సవాలక్ష షరతులు.. ఉమ్మడి కుటుంబాలు వద్దంటున్న మగువలు..

ఆధునికత పెరుగుతున్న కొద్దీ మానవీయ విలువలు తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. ఉమ్మడి ...

news

కొబ్బరినూనె, వేపనూనెలతో చుండ్రు మటాష్

చుండ్రును తొలగించుకోవాలంటే.. కొబ్బరినూనె, వేపనూనెను ఉపయోగించండి అంటున్నారు.. ఆయుర్వేద ...