Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మలంతో నాప్‌కిన్స్ - టిష్యూ - టాయిలెట్ పేపర్స్ తయారీ

గురువారం, 21 డిశెంబరు 2017 (15:29 IST)

Widgets Magazine
panda poo

విన్నూత్న ఆవిష్కరణలకు చైనా పెట్టింది పేరు. పైగా, ఏ చిన్న వ్యర్థాన్ని కూడా వారు వదిలిపెట్టరు. సరిగ్గా ఇపుడు అలాంటిదే జరుగుతోంది. ఈ దేశంలో పాండా మూగజీవులకు పెట్టింది పేరు. ఈ మూగజీవులు విసర్జించే మలంతో ఇపుడు టిష్యూ, టాయిలెట్ పేపర్లను తయారు చేయనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేసిందో కంపెనీ. 
 
సిచువన్ ప్రావిన్స్‌కు చెందిన క్యాన్‌వెయ్ ఫెంగ్‌షెంగ్ పేపర్ కంపెనీ, చైనా కన్జర్వేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్‌తో కలిసి పాండాల మలం, అవి తిని వదిలేసిన ఆహారం వ్యర్థాలతో నాప్‌కిన్స్, టాయిలెట్ పేపర్‌ను తయారు చేయనుంది. 
 
ఇప్పటికే వీటి తయారీ ప్రక్రియను ప్రారంభించింది. దీంతో త్వరలోనే పాండా పూ పేరుతో ఈ టిష్యూ పేపర్లను చైనా మార్కెట్‌లోకి తీసుకురానున్నట్లు కంపెనీ ప్రకటించింది. పాండా మూగజీవులు విసర్జించే మలాన్ని సేకరించి టిష్యూ పేపర్లను తయారు చేయనున్నట్టు తెలిపారు. 
 
సాధారణంగా ఒక పాండా సెంటరులో దాదాపు 10 కిలోల మలం చేరుతుందట. అంతేకాదు 50 కిలోల ఆహారం ప్రతి రోజూ వృధా అవుతోందట. దీన్నంతా సేకరించి, ప్రాసెస్ చేసి పేపర్స్‌గా ఆ కంపెనీ తయారు చేయనుంది. ఒక్క పాండా పూ బాక్స్ ఉన్న టిష్యూలు.. దాదాపు 43 యాన్లకు అమ్మాలని నిర్ణయించింది. అంటే మన కరెన్సీలో సుమారుగా 416 రూపాయలన్నమాట. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

కబ్జాను అడ్డుకుందనీ పబ్లిక్‌గా వివస్త్రను చేశారు... (వీడియో)

విశాఖపట్టణం జిల్లా పెందుర్తిలో ఓ మహిళా కబ్జాను అడ్డుకుంది. దీంతో కబ్జాదారులు ఆ మహిళను ...

news

టీచర్‌ను కారులోకి ఎక్కించుకుని కామదాహం తీర్చుకున్న విద్యార్థులు

గురువు అంటే సాక్షాత్తూ ఆ భగవంతుడుతో సమానమంటారు. కానీ బెంగళూరులో కామంతో కళ్లు మూసుకుపోయిన ...

news

వారిని వదిలిపెట్టొద్దు... ప్రభుత్వం అప్పీల్ చేయాలి : సుబ్రమణ్య స్వామి

2జీ స్కామ్‌లో డీఎంకే నేతలు ఏ.రాజా, కనిమొళిలను నిర్దోషులుగా ఢిల్లీ సీబీఐ ప్రత్యేక కోర్టు ...

news

అయోధ్యలో రామాలయం ఏర్పాటు ఆ ఇద్దరి వల్లే సాధ్యం: స్వరూపానంద

అయోధ్యలో రామాలయ వివాదంపై ద్వారక శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానంద సరస్వతి బృందావనంలో ...

Widgets Magazine