Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సయీద్‌ను ఉరితీస్తారా? లేదా? పాకిస్థాన్‌కు అమెరికా వార్నింగ్

శుక్రవారం, 19 జనవరి 2018 (11:36 IST)

Widgets Magazine
Hafiz Saeed

పాకిస్థాన్‌కు అగ్రరాజ్యం అమెరికా మరో హెచ్చరిక చేసింది. ఇప్పటికే ఉగ్రవాదం నిర్మూలన కోసం అందిస్తూ వచ్చిన నిధులను అమెరికా నిలిపివేసింది. దీంతో పాకిస్థాన్ ఆర్థిక కష్టాల్లో చిక్కుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా మరో అల్టిమేటం జారీ చేసింది. ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్రవేసిన హఫీజ్ సయీద్‌ను చట్టం ముందు నిలబెట్టి ఉరితీయాల్సిందేనని అమెరికా వ్యాఖ్యానించింది. 
 
హఫీజ్‌పై ఎలాంటి కేసూ తమ దేశంలో నమోదు కాలేదని, ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం లేదని పాక్ ప్రధాని షాహిద్ కఖాన్ అబ్బాసీ వ్యాఖ్యానించిన 24 గంటల తర్వాత అమెరికా తీవ్రంగా మండిపడుతూ, పాక్‌కు ఈ హెచ్చరికలు చేయడం గమనార్హం. హఫీజ్ సయీద్ ఉగ్రవాదేనని, గతంలో తమకు హామీ ఇచ్చినట్టుగా ఆయన్ను చట్టం ముందు నిలబెట్టి శిక్షించాల్సిందేనని యూఎస్ ప్రతినిధి హెదర్ న్యువార్ట్ వ్యాఖ్యానించారు. 
 
"యూఎన్ఎస్సీ 1267 ప్రకారం హఫీజ్ ఉగ్రవాది. ప్రపంచానికి ముప్పుగా పరిణమించిన లష్కరే తోయిబాకు అధినేత. ఎల్ఈటీని విదేశీ ఉగ్ర సంస్థగా మేము గుర్తించాం. ఎన్నో దేశాలు కూడా గుర్తించాయి. చట్టప్రకారం అతన్ని శిక్షించాల్సిందే" అని న్యువార్ట్ మీడియాకు తెలిపారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Hang Pakistan America Law Hafiz Saeed

Loading comments ...

తెలుగు వార్తలు

news

శాడిస్ట్ రాజేష్‌కు బెయిల్ ఎందుకు ఇచ్చారంటే?

శోభనం రోజు రాత్రిని కాళరాత్రిగా మార్చి కట్టుకున్న భార్యకు జీవితంలో మరచిపోలేని జ్ఞాపకంగా ...

news

టీడీపీని తెరాసలో విలీనం చేద్ధాం : మోత్కుపల్లి నర్సింహులు

తెలంగాణ ప్రాంతానికి టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ...

news

అగ్ని క్షిపణి 5 సక్సెస్ : చైనాకు వెన్నులో వణుకు

భారత రక్షణ పరిశోధనా సంస్థ (డీఆర్డీవో) అగ్ని క్షిపణి 5ను విజయవంతంగా ప్రయోగించింది. అణు ...

news

ఏపీకి ప్రత్యేక హోదాపై నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సమాధానం ఇదే

అమరావతి : కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరమైన సహకారం అందిస్తామని నీతి ఆయోగ్ ...

Widgets Magazine