ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 16 జనవరి 2018 (09:54 IST)

పూంచ్ సెక్టార్లో భారత్ మరో సర్జికల్ స్ట్రైక్స్ : పాకిస్థాన్ రేంజర్లు హతం

సర్జికల్ స్ట్రైక్స్ అంటే ఓ నిర్దేశిత ప్రాంతంలో పక్కాగా నిఘా నిర్వహించి దాడి చేయడం. ఈ దాడితో ప్రాంతలోని నిర్మాణాలకుగానీ, వాహనాలు, భవనాలకు, ఇతర జనావాసాలకు గానీ ఎలాంటి చిన్ననష్టం కూడా సంభవించదు. పాకిస్థా

సర్జికల్ స్ట్రైక్స్ అంటే ఓ నిర్దేశిత ప్రాంతంలో పక్కాగా నిఘా నిర్వహించి దాడి చేయడం. ఈ దాడితో ప్రాంతలోని నిర్మాణాలకుగానీ, వాహనాలు, భవనాలకు, ఇతర జనావాసాలకు గానీ ఎలాంటి చిన్ననష్టం కూడా సంభవించదు. పాకిస్థాన్ యథేచ్ఛగా మన దేశంలోకి ఉగ్రవాదులను పంపిస్తోంది. జమ్మూ-కశ్మీరులో అల్లర్లను రెచ్చగొడుతోంది.
 
భారత సైనిక స్థావరాలపై ఉగ్రవాద దాడులు జరిపిస్తోంది. సరిహద్దుల వెంబడి నిరంతరం కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలకు పాల్పడుతోంది. దీనికి నిరసనగా మన సైన్యం లక్షిత దాడులు నిర్వహించి, కొందరు ఉగ్రవాదులను మట్టుబెట్టింది.
 
తాజాగా భార‌త సైన్యం మ‌రోసారి సాహ‌సం చేసింది. భార‌త్‌, పాక్‌ స‌రిహ‌ద్దుల్లో ప‌దే ప‌దే కాల్పుల‌కు తెగ‌బ‌డుతూ, ఉగ్ర‌వాదులు చొర‌బ‌డేలా ప్రోత్సహిస్తోన్న పాక్‌కు దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చింది. పూంచ్ సెక్టార్ ప‌రిధిలోని వాస్త‌వాధీన రేఖ ఆవ‌ల భార‌త‌ సైన్యం ల‌క్షిత దాడులు జ‌రిపింది. 
 
ఈ దాడుల్లో ఏడుగురు పాకిస్థాన్ రేంజ‌ర్లను భార‌త సైన్యం హ‌తమార్చింది. అలాగే, చొర‌బాటుకు ప్ర‌య‌త్నించిన మ‌రో ఆరుగురు జైషే మ‌హ్మ‌ద్ ఉగ్ర‌వాదులు కూడా హ‌తమ‌య్యారు. ఉగ్ర‌వాదుల‌ను నియంత్ర‌ణ రేఖ వ‌ద్దే మ‌ట్టుబెట్టినట్లు అధికారులు వెల్లడించారు.